Breaking News

మా మంచి కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించడానికి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర బందం పర్యటనలో భాగంగా మల్లారం అటవీ ప్రాంతం గుండా జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రయాణం చేస్తున్నారు.

దారిలో ఒక వ్యక్తిని (సాయిలు, రుద్రూర్‌) మోటార్‌ సైకిల్‌ కొట్టేసి ప్రమాదం కలిగించి వెల్లగా అదే దారిలో వెళుతున్న కలెక్టర్‌ ప్రమాద బాధితుడిని గమనించి వెంటనే డిపిఆర్‌ఓ వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. జిల్లా కలెక్టర్‌ తన మానవత్వాన్ని చాటుకుని మా మంచి కలెక్టర్‌ అనిపించుకున్నారు.

Check Also

21 నుండి డిగ్రీ, పిజి తరగతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, ...

Comment on the article