బోధన్, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ రాజధాని డిల్లీ శివార్లలో గత రెండు నెలలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలంటూ డిమాండ్ చేస్తూ పోరాడుతుంటే, కేంద్రం పట్టించుకోక పోవడంతో నిన్న వేలాది ట్రాక్టర్లతో లక్షలాది రైతన్నలు డిల్లీలోకి ప్రవేశించడం జరిగిందని, అట్టి అన్నదాతలపై లాఠీ లతో, భాష్పవాయువుతో పాశవిక దాడికి పూనుకోవడం శోచనీయమని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి మల్లేశ్ అన్నారు.
నవ్‌నీత్ సింగ్ అనే రైతు మతి చెందారన్నారు. రాజ్యాంగ విద్దుంగా అప్రజాస్వామ్యంగా చట్టాలను తీసుకొచ్చి, రైతుల భూములను కార్పొరేటు కంపెనీలకు అప్పజెప్పే కుట్రలను వ్యతిరేస్తూ చేస్తున్న రైతు ఉద్యమంలోకి బీజేపీ ప్రభుత్వం, పార్టీ వారి మనుషులను పంపి ఉద్యమంలో హింసాత్మక ఘటనలను సష్టించి పక్కదారి పాటించ జూస్తున్నదని, నిన్నటి ఆందోళనలోని వ్యక్తులు మోడితో కలిసి దిగిన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయన్నరు.
ఇప్పటి కైనా ప్రభుత్వం రైతాంగ డిమాండ్‌ను అంగీకరించి, రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జి.సీతారాం, బి.సాయులు, డి.పొశెట్టి, కే.రవి, సిహెచ్.యాదగిరి గౌడ్, రాములు తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021