డిచ్పల్లి, జనవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి పరిస్థితుల్లో చిరుధాన్యాలు తినడం వలన మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వాటిపైన చైనాలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్త డా. ఎమ్ రామకష్ణన్ తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం ”జీవశాస్త్రములో సరికొత్త పోకడలు” అనే అంశంపై రెండవ అంతర్జాతీయ అంతర్జాల సదస్సు జరిగింది.
సదస్సులో ఆయన మాట్లాడుతూ జన్యుశాస్త్రమునుపయోగించి కొర్రల్లో వివిధ జన్యురూపాలను ఏ విధంగా తయారు చేయవచ్చు మరియు వాటి వలన కలిగే లాభాలు తదితర అంశాలను గూర్చి చక్కగా వివరించారు. అనంతరం బెంగుళూరుకు చెందిన మరొక శాస్త్రవేత్త డా.వి వి.బేలావాడి పరాగ సంపర్కములో కీటకాల పాత్రను గూర్చి చక్కటి చిత్రాల ద్వారా వివరించారు. అనంతరం న్యూజిలాండ్‌కు చెందిన ఇందిర సత్యనారాయణ మాట్లాడుతూ మన రోజువారీ జీవనంలో విజ్ఞానశాస్త్రం ఎంతో ఉపయోగకరమైదన్నారు.
తరువాత యూనివర్సిటీ ఆఫ్ బరోడా, వడోదరకు చెందిన ఆచార్య మమ్మాన్ డానియల్ గారు ఔషధమొక్కల రంగంలో వ్యాపార అవకాశాల గూర్చి చక్కగా వివరించారు. తదనంతరం గురు ఘాసీదాస్ యూనివర్సిటీకి చెందిన డా.అశ్విన్ కుమార్ దిక్షీత్ హెర్బల్ మెడిసిన్ గూర్చి వివరించారు. అనంతరం ఆస్ట్రేలియాకు చెందిన ఉప్పు హేమలత యావత్ ప్రపంచంపై కరోనా మహమ్మారి ప్రభావము దాని ఫలితాల గూర్చి చక్కగా ప్రసంగించారు.
చివరగా మహారాష్ట్ర, శీర్వళ్కు చెందిన డా. మయూర్ నందికర్ మాట్లాడుతూ ప్రత్యేక కుంటుంబాలకు చెందిన మొక్కలను గుర్తించడానికి చక్కటి మెలకువలను తెలిపారు. కార్యక్రమంలో వక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ అహ్మద్ అబ్దుల్ హలీమ్ ఖాన్, ఆచార్య బి. విద్యావర్థిని, బీవోఎస్ ఆచార్య ఎమ్. అరుణ, డా. దేవరాజు శ్రీనివాస్ డా. వి జలంధర్, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన - February 27, 2021
- సమీకృత మార్కెట్ కోసం స్థల పరిశీలన - February 27, 2021
- వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - February 27, 2021