కామారెడ్డి, జనవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో నడుస్తున్న ఎల్లారెడ్డి గిరిజన గురుకుల వసతిగహాన్ని నెల రోజుల వ్యవధిలో ఎల్లారెడ్డిలోని సొంత భవనంలో ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. గురువారం ఆయన టెలీ కాన్ఫరెన్సులో సిఎస్ సోమేశ్ కుమార్తో మాట్లాడారు. ఫిబ్రవరి 1న జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గహాలు ప్రారంభానికి సిద్ధం చేశామని చెప్పారు.
9,10 తరగతుల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పాఠశాలకు పంపడానికి అనుమతి పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఒంటిమామిడి మార్కెట్ యార్డు నుంచి వసతిగహాలలో టెండర్ దారులు కూరగాయలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలను, వసతి గహాలను ఆర్డీవోలు పరిశీలన చేయాలని కలెక్టర్ ఆదేశించారు. టెలీ కాన్పరెన్సులో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఈఓ రాజు, జిల్లా వ్యవసాయ అధికారి సునీత, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, జిల్లా ఎస్సీ, ఎస్టీ, బిసి, .మైనారిటీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు – పలు అంశాలపై సమీక్ష - March 2, 2021
- టీయూ ఐక్యూఎసీ డైరెక్టర్గా ఆచార్య కౌసర్ మహ్మద్ - March 2, 2021
- ‘‘డైరెక్ట్ టాక్సెస్’’ పుస్తకావిష్కరణ - March 2, 2021