కామారెడ్డి, జనవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం రామారెడ్డి ప్రభుత్వా దవాఖానలో ఏఎన్ఎం లకు, అంగన్ వాడి టీచర్స్, వలంటరీస్కి వైద్యాధికారి డాక్టర్ షాహీద్ అలీ పల్స్ పోలియోపై అవహగహన కల్పించారు. ఈనెల 31వ తేదీ ఆదివారం ఆసుపత్రి పరిధిలో గల రామారెడ్డి -ఎ, రామారెడ్డి-బి, ఇస్సన్నపల్లి, ఉప్పల్ వాయి, గిద్ద, పోసానిపెట్, వడ్లూర్ ఎల్లారెడ్డి, సబ్ సెంటర్లలో పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టనున్నట్టు వైద్యాధికారులు తెలిపారు.
పల్స్ పోలీయో కార్యక్రమం 31 జనవరి నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మూడరోజుల పాటు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కావున 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పకుండా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని వైద్యాధికారి తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది భీమ్, విమలాభారతి, ఫార్మసీస్ట్ స్వాతి,రాజు, దోమల శ్రీధర్, శ్రీహరి, మంజుల, రజిత, ఏఎన్ఎంలు, అంగన్వాడి టీచర్లు, అటెండర్లు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు – పలు అంశాలపై సమీక్ష - March 2, 2021
- టీయూ ఐక్యూఎసీ డైరెక్టర్గా ఆచార్య కౌసర్ మహ్మద్ - March 2, 2021
- ‘‘డైరెక్ట్ టాక్సెస్’’ పుస్తకావిష్కరణ - March 2, 2021