పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి

కామారెడ్డి, జనవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ విస్తరణ అధికారులు పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. గురువారం ఆయన టెలి కాన్ఫరెన్సులో వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. ఫిబ్రవరి 3 లోగా వంద శాతం పంటల నమోదు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతు వేదికలను రైతు బంధు కమిటీల కన్వీనర్లతో చర్చించి ఎమ్మెల్యేలతో త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు.

రైతు బీమా సెటిల్మెంట్లు పెండింగ్‌ లేకుండా చూడాలని కోరారు. క్లస్టర్ల వారీగా వ్యవసాయ అధికారులు పంటల నమోదు ప్రక్రియను పరిశీలన చేయాలని పేర్కొన్నారు. టెలీ కాన్ఫరెన్సులో జిల్లా వ్యవసాయ అధికారి సునీత, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Check Also

విపత్తుశాఖ వారి మోబైల్‌ యాప్‌ ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన ...

Comment on the article