Breaking News

Daily Archives: January 29, 2021

మొక్కలను ఉత్పత్తి చేయుటలో కణజాల వర్ధన పద్ధతి లాభాదాయకం

డిచ్‌పల్లి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేయడంలో కణజాల వర్ధన పద్ధతులు లాభదాయకంగా వుంటాయని బాంగ్లాదేశ్‌కు చెందిన ఆచార్య అబ్దుల్లా తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్సు ఆన్‌ ”ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ లైఫ్‌ సైన్సెస్‌” అనే అంశంపై రెండు రోజుల అంతర్జాల సదస్సు జరిగింది. సదస్సులో ఆయన మాట్లాడుతూ కణజాల వర్ధనం ద్వారా అంతరించిపోతున్న మొక్కలను ఉత్పత్తి చేసి వాటిని సంరక్షించవచ్చన్నారు. అనంతరం ఝార్ఖండ్‌ ...

Read More »

చెక్‌ డ్యాం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ సమీపంలో మంజీర నదిపై నూతనంగా నిర్మించే చెక్‌ డ్యాం నిర్మాణ స్థలాన్ని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ మంజీర నదిపై బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో మొత్తం నాలుగు చెక్‌ డ్యాం ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, బీర్కుర్‌ వద్ద రూ. 28 కోట్లతో నిర్మించే చెక్‌ డ్యాం పనులకు గురువారం శంకుస్థాపన చేసి పనులను ...

Read More »

పల్లె ప్రగతి పనులపై కలెక్టర్‌ సీరియస్‌

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి పనులలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. శుక్రవారం కామారెడ్డి మండలం గర్గుల్‌ గ్రామంలో పల్లె ప్రగతి పనులను కలెక్టర్‌ పరిశీలించారు. పల్లె ప్రకతి వనంలో కొన్ని మొక్కలు ఎండిపోవడం, నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వాచర్‌ను నియమించకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేయాలని, మండల పంచాయతీ అధికారికి చార్జి మెమో ఇవ్వాలని, గ్రామ సర్పంచుకు ...

Read More »

తహసీల్‌దారుని అభినందించిన కలెక్టర్‌

కామారెడ్డి జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి రిజిస్ట్రేషన్‌ ద్వారా పెండింగ్‌లో వున్న కేసులను వారం లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ తహశీలుదార్లను ఆదేశించారు. శుకవారం జనహితలో ఆర్‌డిఓలు, తహశీలుదార్లు, రైస్‌ మిల్స్‌ యజమానులతో ధరణి, సిఎంఆర్‌ కార్యక్రమాలను సమీక్షించారు. స్లాట్స్‌ బుక్‌ చేసుకున్న వారి పెండింగ్‌ వివరాలను మండల వారిగా ఆయన సమీక్షించి, వారం రోజుల వ్యవధిలో పెండింగ్‌ కేసులను పరిష్కరించాలని ఆదేశించారు. డబుల్‌ రిజిస్ట్రేషన్స్‌ కాకుండా తహశీలుదారు చూసుకోవాలని సూచించారు. పెండింగ్‌ కేసులు లేని ...

Read More »

జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌ పోటీలకు నిజామాబాద్‌ క్రీడాకారులు

ఆర్మూర్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 31 నుండి బెంగళూరులో జరగనున్న జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్‌ షిప్‌ పోటీలలో నిజామాబాద్‌ పట్టణానికి చెందిన తైక్వాండో క్రీడాకారులు పాల్గొననున్నారు. బాలికల విభాగంలో మద్దుల శ్రీనిక 12 సంవత్సరాలలోపు సబ్‌ జూనియర్‌ విభాగంలో, అలాగే 12 సంవత్సరాల బాలుడు శ్రీహిత్‌ గౌడ్‌, సీనియర్‌ విభాగంలో రాజు పాల్గొననున్నారు. నిజామాబాదు టైక్వాండో అసోసియేషన్‌ నుండి క్రీడాకారులు పాల్గొననున్నారు. క్రీడాకారులకు నిజామాబాద్‌ పట్టణ ఏసిపి ఆఫ్‌ పోలీస్‌ శ్రీనివాస్‌ కుమార్‌ క్రీడాకారులకు అభినందించారు. ...

Read More »

పక్క రాష్ట్రాలకు కూడా పంపుతున్నాము…

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతి భవనంలో విజయ డైరీ ఛైర్మెన్‌ లోక భూమరెడ్డి, ఎండి శ్రీనివాస్‌ రావ్‌తో కలసి జిల్లా కలెక్టర్‌ పాల ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ పాల అమ్మకాలు 3 లక్షల 72 వేల నుండి 4 లక్షల లీటర్ల వరకు చేరుకున్నదని, పాల సేకరణ 2.50 లక్షల నుండి 5 లక్షల లీటర్ల వరకు చేరుకోవడమైనదని తెలిపారు. ఇక్కడనే కాకుండా మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు పంపుతున్నామన్నారు. గతంలో ఇంటింటా ...

Read More »

మానవతా సదన్‌కు యువ ఇంజనీర్‌ సాయం

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనాథ బాలల పునరావాస కేంద్రం మానవతా సదన్‌ డిచ్‌పల్లి బాలల సంక్షేమం కోసం డిచ్‌పల్లి మండలం ముల్లంగి గ్రామానికి చెందిన రైతు అనంత్‌రెడ్డి పెద్ద కుమార్తె సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అనుజారెడ్డి ఇంజనీరుగా తన మొదటి నెల వేతనం రూ. 40 వేలు చెక్కు రూపంలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డికి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. జిల్లా కలెక్టర్‌ ఈ సందర్భంగా యువ ఇంజనీరును అభినందించారు. అనుజారెడ్డి సేవా దృక్పథం స్ఫూర్తి దాయకం, ఆదర్శనీయమని, ...

Read More »