Breaking News

చెక్‌ డ్యాం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, జనవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ సమీపంలో మంజీర నదిపై నూతనంగా నిర్మించే చెక్‌ డ్యాం నిర్మాణ స్థలాన్ని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ మంజీర నదిపై బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో మొత్తం నాలుగు చెక్‌ డ్యాం ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, బీర్కుర్‌ వద్ద రూ. 28 కోట్లతో నిర్మించే చెక్‌ డ్యాం పనులకు గురువారం శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించామన్నారు.

బాన్సువాడ సమీపంలో రూ. 18 కోట్లతో నిర్మించనున్న చెక్‌ డ్యాంకు టెండర్‌ ప్రాసెస్‌ పూర్తయిందని, త్వరలోనే శంకుస్థాపన చేసి పనులను ప్రారంభిస్తామని స్పీకర్‌ పేర్కొన్నారు. చెక్‌ డ్యాంల నిర్మాణంతో మంజీర నదిలో 365 రోజులు నీళ్ళు నిల్వ ఉంటాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. వచ్చే 15 రోజులలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌ జలాశయం నుండి నిజాంసాగర్‌ ప్రాజెక్టు లోకి వస్తాయని, తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న రైతు అభివద్ధి, సంక్షేమ పథకాలు దేశంలోని మిగతా రాష్ట్రాలలో లేవన్నారు.

ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా యాబై లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. దీనితో పాటుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, సీతారామ ఎత్తిపోతలు డిండి పథకం నిర్మాణంలో ఉన్నాయని, వీటన్నింటి ద్వారా మొత్తం కోటి పది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీనితో ప్రాజెక్టుల ఆయకట్టు క్రింద ఏటా లక్షా యాబై వేల కోట్ల రూపాయల పంటలు పండుతాయని స్పీకర్‌ వివరించారు.

రైతులు ఆర్థికంగా అభివద్ధి చెందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని, ప్రతిపక్ష నాయకులు అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. సందర్శనలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పీకర్‌ వెంట ఉన్నారు.

Check Also

వ్యాయామశాలను పరిశీలించిన భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని హనుమాన్‌ ఆలయాన్ని శనివారం డిసిసిబి ఛైర్మన్‌ ...

Comment on the article