డిచ్పల్లి, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని యానంపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ముఖ్యంగా ఆన్లైన్ మోసాల గురించి జాగ్రత్త వహించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, లేకుంటే ప్రయాణం చేయొద్దని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
అదేవిధంగా చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సమస్యలకు పరిష్కార మార్గం అన్వేషించాలన్నారు. ధూమపానానికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. మోస పూరిత ప్రకటనలు నమ్మవద్దని, ఏటిఎం కార్డు సమాచారం ఇవ్వరికి ఇవ్వవద్దన్నారు.
మహిళలు గొలుసు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లకూడదని హెచ్చరించారు. షీటీం ఉపయోగించే విధానం, సైబర్ నేరాలు, మూఢ నమ్మకాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిచ్పల్లి పోలీస్ స్టేషన్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సురేష్ కుమార్, గ్రామ సర్పంచ్, విడిసి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021