Breaking News

Monthly Archives: February 2021

విజ్ఞానశాస్త్రంలో మహిళా శాస్త్రవేత్తలు రాణించాలి

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుప్రసిద్ధ భౌతికశాస్త్రవేత్త సర్‌ సి.వి. రామన్‌ని స్మరించుకుంటూ తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని వృక్షశాస్త్ర విభాగంలో ఆదివారం రోజున అంతర్జాలంలో ‘‘జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని’’ నిర్వహించారు. కార్యక్రమంలో నలుగురు ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఆచార్య మంజు శర్మ, ఆచార్య ఎస్‌. మోహన్‌ కరుప్పాయిల్‌, ఆచార్య ఆర్‌. మధుబాల‌, డాక్టర్‌ బి. దినేష్‌ కుమార్‌ వక్తలుగా పాల్గొన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం కార్యక్రమాన్ని స్వాగతోపన్యాసంతో ప్రారంభించారు. అనంతరం భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, పద్మ భూషణ్‌ ఆచార్య మంజు ...

Read More »

11 బార్లకు దరఖాస్తుల‌ ఆహ్వానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో 12 కొత్త బార్లకు గతంలో నోటిఫికేషన్‌ జారీ చేయగా భీమ్‌గల్‌ ఒక బారుకు మాత్రమే డ్రా తీసిన విషయం తెలిసిందే. కాగా డ్రా వాయిదాపడిన మిగతా 11 బార్లకు తిరిగి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ అధికారి డాక్టర్‌ నవీన్‌ చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నోటిఫై చేయబడిన బార్ల వివరాలు 1.నిజామాబాద్‌ కార్పొరేషన్‌ 7 2.ఆర్మూరుమున్సిపాలిటీ 1 3.బోధన్‌ మున్సిపాలిటీ 3 బార్లు. దరఖాస్తులు ...

Read More »

ఏబివిపి రాష్ట్ర మహాసభల‌ బ్రోచర్‌ విడుదల‌

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల‌ భారతీయ విద్యార్థి పరిషత్‌ స్వాగత కమిటీ అధ్వర్యంలో రాష్ట్ర మహా సభల‌ భ్రోచర్‌ విడుదల‌ చేశారు. రాష్ట్ర మహసభలు 6-7 తేదీల‌లో కామారెడ్డిలో నిర్వహించడం జరుగుతుందని, మొట్ట మొదటి సారిగా కామారెడ్డిలో రాష్ట్ర మహా సభలు కావునా రాష్ట్ర నలుమూలల‌ నుంచి విధ్యార్థి పరిషత్‌ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితిలు విధ్యా రంగ సమస్యలు పలు ఆంశాల‌పై తీర్మానం చేయడం జరుగుతుందని అన్నారు.

Read More »

సోమవారం నుండి సాధారణ ప్రజల‌కు కరోనా వ్యాక్సిన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 60 సంవత్సరాలు దాటిన వారికి, అదేవిధంగా 40 సంవత్సరాలు దాటి ఆరోగ్య సమస్యలు ఉన్న సాధారణ ప్రజల‌కు సోమవారం నుండి కరోనా వ్యాక్సిన్‌ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌తో కరోనా వ్యాక్సిన్‌ కొరకు తీసుకోవల‌సిన చర్యల‌పై సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంతవరకు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, హెల్త్‌ కేర్‌ ఉద్యోగుల‌కు కరోనా వ్యాక్సిన్‌ అందజేశామని, మార్చి ...

Read More »

క్రొవ్వొత్తుల‌తో న్యాయవాదుల‌ నిరసన ప్రదర్శన

బోధన్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కర్ణాటక రాష్ట్ర న్యాయవాది దారుణ హత్యకు నిరసనగా బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ శనివారం రాత్రి బోధన్‌ లోని అంబేద్కర్‌ చౌరస్తాలో కర్ణాటక రాష్ట్ర కొంభట్‌ న్యాయవాది దారుణ హత్యను నిరసిస్తూ క్రొవొత్తుల‌తో నిరసన ప్రదర్శన చేపట్టారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో న్యాయవాద పరిరక్షణ చట్టం ప్రవేశ పెట్టాల‌ని బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏజాజ్‌ అహ్మద్‌, ఉపాధ్యక్షుడు ఖలీం, కార్యదర్శి జె. శ్రీనివాస్‌, సంయుక్త ...

Read More »

సమీకృత మార్కెట్‌ కోసం స్థల‌ పరిశీల‌న

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణంలోని నీటిపారుదల‌ శాఖ కార్యాల‌యం ఆవరణలో సమీకృత మార్కెట్‌ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు పట్టణానికి నడి బొడ్డున ఉన్న ఇరిగేషన్‌ కార్యాల‌యం ఆవరణలో స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రజల‌కు రైతుల‌కు స్థలం సౌకర్యంగా ఉంటుందని గుర్తించామన్నారు. అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌, ఎల్లారెడ్డి మునిసిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.

Read More »

వృద్దుల‌కు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివారులోని వృద్ద ఆశ్రమంలో నిర్వహించిన గ్రామీణ వయోవృద్ధుల‌ మేళా 2021 కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పాల్గొని వృద్ధుల‌కు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధుల‌కు పోషక అవసరాల‌ను తమ పిల్ల‌లు తీర్చాల‌ని కోరారు. వృద్ధుల‌ సమస్యల‌ను తమ పిల్ల‌లు తీర్చకపోతే గ్రామ పంచాయతీ పాల‌క వర్గం దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీ పాల‌క వర్గంలో ...

Read More »

పదవివిరమణ పొందిన తహసీల్దార్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల‌ కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాల‌యంలో అఖిల‌ భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పదవి విరమణ పొందిన రామారెడ్డి ఎంఆర్‌వో బాబా షరూఫుద్దీన్‌ని ఘనంగా సన్మానించినట్టు రామారెడ్డి మండల‌ అధ్యక్షులు ల‌క్కాకుల‌ నరేష్‌ అన్నారు. పదవి విరమణ ప్రతి ఒక్క అధికారికి సహజమని, రామారెడ్డి మండల‌ ప్రజల‌కు చేసిన సేవ‌లు మరువలేనివని ఎమ్మార్వోను అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో కార్యాల‌యం సీనియర్‌ అసిస్టెంట్ ల‌లిత, ...

Read More »

మేకల‌ సంతలో బాలిక తప్పిపోయింది…

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సాటాపూర్‌ గ్రామానికి చెందిన రుక్మవ్వ 7 సంవత్సరాల‌ వయస్సు గల‌ తన మనుమరాలు అనితను తీసుకొని ప్రతి శనివారం నవిపేట్‌లో జరిగే మేకల‌ సంతలో వారి మేకను అమ్మడానికి వెళ్ళారు. కాగా పాప తప్పిపోయి ఏడుస్తుండగా అక్కడే మార్కెట్‌ డ్యూటీలో ఉన్న నవిపేట్‌ పిఎస్‌ కానిస్టేబుల్‌ జాకీర్‌ హుస్సేన్‌, రవీందర్‌ హోంగార్డు గమనించి ఏడుస్తున్న అనితను దగ్గరకు తీసుకొని విచారించగా సరైన సమాచారం ల‌భించకపోవడంతో విచారణ చేపట్టి ...

Read More »

వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైకుంఠధామాల‌ను త్వరితగతిన పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ పంచాయితీ రాజ్‌ అధికారుల‌ను ఆదేశించారు. శుకవారం జనహిత భవన్‌లో ఆర్‌డిఓలు, పంచాయితీరాజ్‌ ఇంజనీర్లతో వైకుంఠధామం పనుల‌ను మండలాల‌ వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠధామాల‌లో మిగిలిన ల‌క్ష్యాన్ని వెంటనే పూర్తి అయ్యేలా క్షేత్రస్థాయిలో ఎఇ, డిఇలు పర్యవేక్షించాల‌ని ఆదేశించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ పనుల‌కు సంబంధించి ఇసుక కొరత లేదని, ఆర్‌డిఓల‌ సహకారంతో ఇసుక సిద్ధం చేసుకోవాల‌ని సూచించారు. ...

Read More »

బాలల‌ హక్కుల‌ పరిరక్షణ కోసం కృషి

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల‌ హక్కుల‌ పరిరక్షణ కోసం నిరంతరం కృషిచేస్తామని డిస్ట్రిక్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ శరత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాల‌ రక్ష భవన్‌ కార్యాల‌యంలో ఏర్పాటుచేసిన విలేకరుల‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్య‌వివాహాల‌పై ప్రజల‌కు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తామన్నారు. బాలికల‌పై రోజురోజుకు వేధింపులు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించేందుకు కమిటి పనిచేస్తుందన్నారు. పసికందుల‌ను విక్రయించడం, అనధికారిక దత్తతను తీసుకోవడం నేరమని అలాంటివి ఎక్కడైనా జరిగితే ...

Read More »

పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం నరసన్నపల్లిలో నీటి దినోత్సవంలో భాగంగా శుక్రవారం అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కల‌కు జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే నీళ్లు పట్టారు. నాటిన మొక్కల‌ను సంరక్షించాల‌ని సూచించారు. నర్సరీలో మొక్కలు సక్రమంగా లేనందున పంచాయతీ కార్యదర్శి నవనీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More »

తెలంగాణ ఉద్యమకారుల‌ ఫోరం జిల్లా కో ఆర్డినేటర్‌గా డి.యల్‌.యన్‌.చారి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1993 నుండి 2014 తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు అలుపెరుగని పోరాటం చేసిన, తెలంగాణ ఉద్యమం అనుభవం ఉన్న వ్యక్తి నిజామాబాద్‌ జిల్లా కో ఆర్డినేటర్‌గా నియమించడం రాష్ట్ర కమిటిలో మంచి పరిణామమని రాష్ట్ర కమిటీ నాయకులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఫోరమ్‌ రాష్ట్ర కమిటీ ఛైర్మన్‌ డా. చీమల‌ శ్రీనివాస్‌ చేతుల‌మీదుగా నియామక పత్రాన్ని డి.యల్‌.యన్‌.చారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల‌ను స్వతంత్ర ...

Read More »

ప్రఖండ దేశభక్తుడు వీర సావర్కర్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినాయక దామోదర వీర సావర్కర్‌ 55 వ వర్ధంతిని ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్‌లొ నిర్వహించారు. వీర సావర్కర్‌ చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ పట్టణ బిజెపి అధ్యక్షుడు జెస్సు అనిల్‌ కుమార్‌, భారతీయ జనతా కిసాన్‌ మోర్చా పట్టణ అధ్యక్షుడు పాలెపు రాజ్‌ కుమార్‌ు మాట్లాడుతు వినాయక దామోదర్‌ సావర్కర్‌ ఓ ప్రఖంఢ దేశభక్తుడని, ...

Read More »

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం – న్యాయవాదుల‌ నిరసన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైకోర్టు న్యాయవాదులు వామనరావ్‌ నాగమణి దంపతుల‌ జంట హత్యల‌ను నిరసిస్తూ తెలంగాణ స్టేట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషస్స్ పిలుపుమేరకు ఆందోళనలో భాగంగా శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచి కట్ల గోవర్థన్‌ మాట్లాడుతూ న్యాయవాదుల‌ హత్యల‌ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికైనా సిబిఐ చేత విచారణ జరిపించాల‌ని ...

Read More »

కామారెడ్డిలో విశ్వ ఆగ్రోటెక్ సేవ‌లు

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఆయిల్‌ఫామ్‌ సాగుపై జిల్లా వ్యవసాయ, ఉద్యానవన అధికారుల‌తో విశ్వ ఆగ్రోటెక్‌ సంస్థ ప్రతినిధులు గురువారం జిల్లాకలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ని కలిసి జిల్లాలో తాము చేపట్టే ఆయిల్‌ ఫామ్‌పై వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో విశ్వ ఆగ్రోటెక్‌ సంస్థ ద్వారా ఆయిల్‌పామ్‌ సాగు, ప్రాసెసింగ్‌ కోసం రైతుల‌కు వ్యవసాయ, ఉద్యానవన శాఖ సహకారంతో నాణ్యమైన ఫామ్‌ ఆయిల్‌ మొక్కల‌ను, డ్రిప్‌ ఇరిగేషన్‌ సౌకర్యం, ఎరువుల‌ సబ్సిడీ ద్వారా అందచేయడం జరుగుతుందని, మొక్క ...

Read More »

ఎంపీ బి.బి పాటిల్‌కు ఫేమ్‌ ఇండియా మ్యాగజైన్‌ ఉత్తమ పార్లమెంటీరియన్‌ అవార్డ్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ ఎంపి బి.బి పాటిల్‌ను ఫేమ్‌ ఇండియా మ్యాగజైన్‌ 2021 సంవత్సరం ఉత్తమ పార్లమెంటీరియన్‌గా గుర్తించింది. దేశ వ్యాప్తంగా 25 మంది ఎంపీలు ఎంపిక కాగా తెలుగు రాష్ట్రాల‌ నుండి జహీరాబాద్‌ ఎంపీ బి.బి పాటిల్‌ ఒక్కరే అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డిని హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ఎంపీ బి.బి పాటిల్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ...

Read More »

అధికారులు పాజిటివ్‌ థింకింగ్‌తో పని చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు ప్రజల‌కు సేవలందించడంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే కొంత పాజిటివ్‌గా ఉండాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. ప్రణాళిక శాఖ డైరెక్టర్‌గా ప్రమోషన్‌తో పాటు బదిలీపై హైదరాబాద్‌ వెళుతున్న చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ శ్రీరాములుకు గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారుల‌ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న సిపివోకు జ్ఞాపిక అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ...

Read More »

ఆదర్శం సనత్‌ కుమార్‌ శర్మ

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో గురువారం దోమకొండ మండల‌ కేంద్రానికి చెందిన సనత్‌ కుమార్‌ శర్మ 59వ సారి ఏ పాజిటివ్‌ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ గతంలో ఆర్‌.కె. కళాశాల‌ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న సందర్భంలో ఆపదలో ఉన్నవారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తాన్ని అందజేయడం జరిగిందని వీరి లాంటి వ్యక్తుల‌ స్ఫూర్తితోనే కామారెడ్డి రక్తదాతల‌ సమూహాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ...

Read More »

వినియోగదారుల‌ రక్షణ చట్టం పుస్తక ఆవిష్కరణ

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారుల‌ రక్షణ చట్టం 2019 ఆంగ్లము నుండి తెలుగులోకి అనువదించిన పుస్తకాన్ని గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ కుమార్‌ చేతుల‌ మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వినియోగదారుల‌ రక్షణ చట్టం పుస్తకం ప్రతిఒక్క వినియోగదారుడి చేతికి ఆయుధమని, అందరికి అర్ధమయ్యే విధంగా ఆంగ్లము నుండి తెలుగులోకి అనువదించి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు. చట్టాన్ని ప్రతిఒక్క వినియోగదారుడు తెలుసుకుని రక్షణ కలిపించుకోవాల‌ని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి ...

Read More »