Breaking News

Daily Archives: February 1, 2021

జిల్లాకు రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాక

కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిర్మల్‌రెడ్డి ఫిబ్రవరి 2 న ఉదయం 11-30 గంటల‌కు భికనూర్‌ మండల‌ కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల‌లో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్ధుల‌కు మాస్క్‌లు అందచేసే కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. అనంతరం అంగన్‌ వాడీ, రేషన్‌ షాట్లను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2-30 గంటల‌కు కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ డిగ్రీ కాలేజీలో ఇండియన్‌ రెడ్‌ కాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ...

Read More »

ఫోన్‌ ఇన్‌లో 22 ఫిర్యాదులు

కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా 22 ఫిర్యాదుల‌ను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చంద్రమోహన్‌ రెడ్డి స్వీకరించారు. సోమవారం కామారెడ్డి జనహిత భవన్‌లో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో 12 రెవిన్యూ శాఖ, 10 జిల్లా పంచాయితీ అధికారి కార్యాల‌యానికి సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read More »

మహిళకు రక్తదానం

కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంపేట మండలం నందగోకులం గ్రామానికి చెందిన స్వప్న (31) అనే మహిళ రక్తహీనతతో రామాయంపేటలోని వైద్యశాల‌లో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. బి పాజిటివ్‌ రెండు యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడడం జరిగిందని, కామారెడ్డితో పాటు మెదక్‌ రామాయంపేట, నిజామాబాద్‌, సిరిసిల్లా, హైదరాబాద్‌, ప్రాంతాల్లో ఆపదలో ఉన్న వారికి కూడా సకాలంలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడడం జరుగుతుందన్నారు. టెక్నీషియన్‌ చందన్‌, స్వామి, ...

Read More »

గురుకుల‌ పాఠశాల‌ను సందర్శించిన అధికారులు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం భౌతిక తరగతులు ప్రారంభమైనందున గురకుల‌ పాఠశాల‌ను ఎంపిపి, జడ్‌పిటిసి, ఎండివో, ఎంఇవో ఆకస్మికంగా తనికీ చేశారు. కోవిడ్‌ నిబంధనల‌ ప్రకారం తగు చర్యలు తీకున్నారా లేదా అని పలు అంశాల‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల‌ తరపున మాస్కులు కూడా పంపిణీ చేశారు.

Read More »

నిర్ణీత సమయంలో టీఎస్‌ ఐ-పాస్‌ అనుమతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎస్‌ ఐపాస్‌ అనుమతుల‌ను నిర్దేశించిన సమయంలో మంజూరు చేయడంతో పాటు నిబంధనల‌ ప్రకారం ముందుకు వెళ్లాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత శాఖ అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో జిల్లా పరిశ్రమల‌ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ అధ్యక్షతన డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కమిటీ టీఎస్‌ ఐపాస్‌ పై సమావేశం నిర్వహించి అనుమతుల‌కు ఆమోదం తెలిపారు. nizam ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిశ్రమల‌ స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికుల‌కు ...

Read More »

బెల్లాల్‌ చెరువులో అనుమానాస్పదంగా మృతదేహం

బోధన్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గౌడ్స్ కాల‌నీకు చెందిన రఘుపతి ప్రశాంత్‌ (అలియాస్‌) రాజు అనే యువకుడు జనవరి 29 శుక్రవారం సాయంత్రం నుండి కనబడకుండాపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం బోధన్‌ బెలాల్‌ చెరువులో గుర్తుతెలియని మృతదేహం ఉందని సమాచారం రావడంతో ప్రశాంత్‌ తల్లిదండ్రుల‌కు సమాచారం ఇచ్చారు. ప్రశాంత్‌ తలిదండ్రులు మృతదేహాన్ని చూసి ప్రశాంతేనని నిర్దారించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రశాంత్‌ మృతితో ...

Read More »

రెండోరోజు పల్స్‌పోలియో

కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలోని గ్రామాల్లో రెండవరోజు పల్స్‌ పోలియో విజయవంతంగా నిర్వహించారు. రామరెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలో గల‌ రామరెడ్డి ఎ, బి, ఇస్సన్నపల్లి, పోసానిపెట్‌, కన్నపూర్‌, గిద్ద, ఉప్పల్‌ వాయి, తిర్మన్‌ పల్లి, వడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామాల్లో రెండవ రోజు పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఆదివారం ఎవరైతే పోలియో చుక్కలు వేయించుకోలేదో వారిని గుర్తించి చుక్క మందు అందించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది భీమ్‌, విమలాభారతి, ల‌లిత, ...

Read More »