Breaking News

నిర్ణీత సమయంలో టీఎస్‌ ఐ-పాస్‌ అనుమతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎస్‌ ఐపాస్‌ అనుమతుల‌ను నిర్దేశించిన సమయంలో మంజూరు చేయడంతో పాటు నిబంధనల‌ ప్రకారం ముందుకు వెళ్లాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత శాఖ అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో జిల్లా పరిశ్రమల‌ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ అధ్యక్షతన డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కమిటీ టీఎస్‌ ఐపాస్‌ పై సమావేశం నిర్వహించి అనుమతుల‌కు ఆమోదం తెలిపారు.

nizam

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిశ్రమల‌ స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికుల‌కు సరైన దిశ- నిర్దేశం చేయడంతోపాటు వారిని ప్రోత్సహించాల‌ని తద్వారా వారితో పాటు మరికొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ల‌భిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా స్వయం ఉపాధి, ఇతర పరిశ్రమల‌ ఏర్పాటు కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి అవసరమైన అన్ని శాఖల‌ అనుమతుల‌తో పాటు సబ్సిడీని కూడా సకాలంలో అందించాల‌ని తద్వారా వారు ఆర్థికంగా ఇబ్బందుల‌ నుండి బయటపడడానికి వీలు కలుగుతుందన్నారు.

స్వయం ఉపాధి కింద రుణాలు పొందే ఎస్సీల‌కు, ఎస్టీల‌కు 35 శాతం సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాల‌ను ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాల‌ని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సమావేశంలో నలుగురు ఎస్సీల‌కు, తొమ్మిది మంది ఎస్టీల‌కు గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టుకు సంబంధించి మైక్రో యూనిట్‌ మంజూరు చేయుటకు 35 శాతం సబ్సిడీ అందించుటకు ఆమోదం తెలిపినట్లు ఆయన వివరించారు.

ఇప్పటికీ ఒక వెయ్యి 64 అనుమతుల‌కు దరఖాస్తు చేసుకోగా 840 అనుమతులు జిల్లా పరిశ్రమల‌ శాఖ ద్వారా జారీ చేయడం జరిగిందని ఆ శాఖతో పాటు రవాణా ప్యొూషన్‌ కంట్రోల్‌ ఇతర శాఖల‌ అనుమతులు కూడా ఎప్పటికప్పుడు నిర్ణీత సమయంలో జారీ చేయుటకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాల‌ని మరోవైపు ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించాల‌ని ఆయన ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల‌ శాఖ జనరల్‌ మేనేజర్‌ బాబురావు, ఎల్‌డిఎం జయ సంతోషి, పిసిబి ఈఈ బిక్షపతి, ఇతర శాఖల‌ అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article