Breaking News

Daily Archives: February 3, 2021

స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా షెడ్యూల్డ్‌ కులాల‌ సేవా సహకార అభివృద్ధి సంస్థ, నిజామాబాద్‌ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్‌ కులాల‌ యువతి, యువకుల‌కు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీ రుణాలు వార్షిక ప్రణాళిక 2020-21 సంవత్సరానికి ఆన్‌ లైన్‌లో నమోదు చేసుకోవడానికి ఈనెల‌ 10వ తేదీవరకు చివరి గడువు పొడిగించినట్టు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల‌ సేవా సహకార అభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక సంచాల‌కులు రాజేశ్వరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.

Read More »

30 పడకల ఆసుపత్రి భవనం ప్రారంభం

జుక్కల్‌ ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ మండల‌ కేంద్రంలో నూతనంగా నిర్మించిన 30 పడకల‌ ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని బుధవారం జుక్కల్‌ శాసనసభ్యులు హన్మంత్‌ షిండే సభాధ్యక్షతన రోడ్లు, భవనాల‌ శాఖ మంత్రివర్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిధులుగా కామారెడ్డి జిల్లా జడ్పి చైర్‌ పర్సన్‌ ధఫెదర్‌ శోభ రాజు, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వైద్య శాఖ అధికారులు ...

Read More »

క్యాలెండర్‌ ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గవర్నమెంట్‌ కాలేజ్‌ టీచర్‌ అసోసియేషన్‌ వారి 2021 నూతన సంవత్సర క్యాలెండర్‌ మరియు డైరీని బుధవారం గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల‌ ప్రిన్సిపల్‌ డాక్టర్ ఇ.ల‌క్ష్మీనారాయణ, (టిజిసిటిఎ) నిజామాబాద్‌ జిల్లా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఇ.గంగాధర్‌, నిజామాబాద్‌ జిల్లా జనరల్‌ సెక్రెటరీ, డాక్టర్‌ టి.పెద్దన్న, ట్రెజరీ డాక్టర్‌ ఎన్‌.అంబర్‌సింగ్‌, మహిళ సెక్రెటరీ డాక్టర్‌ బి.సుమల‌త, సభ్యులు, డాక్టర్‌ సురేశ్‌, డాక్టర్‌ లింగన్న, బాబురావు, డాక్టర్‌ సతీష్‌, డాక్టర్‌ ...

Read More »

విద్యుత్‌ షాక్‌కు గురైన బాలునికి రక్తదానం

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం ఆర్‌బి నగర్‌కు చెందిన బాలుడు ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైర్లు తగల‌డంతో అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాల‌కు తరలించారు. చికిత్స నిమిత్తం ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ నిర్వహకుడు బాలును సంప్రదించారు. వారికి కావాల్సిన రక్తాన్ని గాంధీ వైద్యశాల‌లో సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడినట్టు బాలు తెలిపారు. రక్తదానానికి సహకరించిన కిరణ్‌ వారి మిత్రుల‌కు రక్తదాతల‌ సమూహం తరఫున కృతజ్ఞతలు ...

Read More »

స్వాగత తోరణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల‌కు బుధవారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభోత్సవాలు చేశారు. గంప గోవర్ధన్‌ తండ్రి గంప వెంకయ్య జ్ఞాపకార్థం నిర్మించిన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల‌ స్వాగతతోరణాన్ని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. అనంతరం ఇ వ్‌ జిడిసి లోగో ఆవిష్కరించారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, పలువురు అధికారులు, నాయకులు ఉన్నారు.

Read More »

చెక్‌ డ్యాం నిర్మాణ పనుల‌కు శంకుస్థాపన చేసిన స్పీకర్‌, మంత్రి

బాన్సువాడ, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ సరిహద్దులో మంజీర నదిపై రూ. 15.98 కోట్లతో నూతనంగా నిర్మించనున్న చెక్‌ డ్యాం నిర్మాణ పనుల‌కు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సభాధ్యక్షతలో రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేము ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జుక్కల్‌ శాసనసభ్యులు హన్మంత్‌ షిండే, కామారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ధఫేదార్‌ శోభ రాజు, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి ...

Read More »