Breaking News

Daily Archives: February 5, 2021

7న ఆధ్యాత్మిక చింతన మౌన శిబిరం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు ఆర్యసమాజము ఆధ్వర్యంలో 7వ తేదీ ఆదివారం ఆధ్యాత్మిక చింతన మౌన శిబిరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ఒకప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల‌ వరకు యోగ, ధ్యానం, సంధ్య, యజ్ఞం, ఆధ్యాత్మిక చింతన ప్రవచనములు, ఆధ్యాత్మిక చింతన మననం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. sa శిబిరంలో పాల్గొనదచిన వారు పూర్తిగా మౌనం పాటించాల‌ని, అప్పుడే దివ్యమైన అనుభూతిని పొందగలుగుతారన్నారు. అలాగే సెల్‌ఫోన్‌ రోజంతా స్విచ్‌ ఆఫ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ...

Read More »

శనివారం నుండి పార్టు-బి ఉద్యోగుల‌కు వ్యాక్సినేషన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నుండి కరోనా వ్యాక్సిన్‌ను రెవిన్యూ, పంచాయతీ రాజ్‌, పోలీస్‌ ఉద్యోగుల‌కు ఇవ్వనున్నట్లు డిఎం అండ్‌ హెచ్‌వో సుదర్శనం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవిన్యూ, పంచాయతీరాజ్‌, పోలీస్‌ శాఖ ఉద్యోగుల‌కు శనివారం ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ నిజామాబాద్‌ నందు, అర్సపల్లి పిహెచ్‌సిలో ఇవ్వనున్నట్లు తెలిపారు. సోమవారం నుండి పూర్తిస్థాయిలో అన్ని చోట్ల ఇవ్వనున్నట్లు ప్రకటనలో తెలిపారు.

Read More »

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో తెరాస పార్టీ పట్టణ విభాగం యూత్‌ అధ్యక్షుడు భాను ప్రసాద్‌, తెరాస పార్టీ మండల యూత్‌ విభాగం అధ్యక్షుడు అనిల్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా తెరాస పట్టణ విభాగం యూత్‌ అధ్యక్షుడు భాను ప్రసాద్‌, కామారెడ్డి మండల‌ తెరాస పార్టీ యూత్‌ విభాగం అధ్యక్షుడు అనిల్‌ రెడ్డి, రెడ్‌ క్రాస్‌ సొసైటీ ...

Read More »

6న జరిగే నిరసన జయప్రదం చేయండి

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాల‌ని కోరుతూ గత 70 రోజులుగా డిల్లీలో రైతులు దీక్ష‌లు చేస్తున్నా పట్టించుకోకుండా ఉన్న కేంద్ర ప్రభుత్వం చర్యల‌ను నిరసిస్తూ రైతు సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 6న దేశ వ్యాప్తంగా రోడ్లపై నిరసనకు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తు శనివారం జరిగే నిరసన‌ను జయప్రదం చేయాల‌ని సిపిఐ, సిపిఎం, సిపియుఎస్‌ఐ న్యూడేమోక్రసి నాయకులు పిలుపు నిచ్చారు. శుక్రవారం సిపిఎం పార్టీ కార్యాల‌యంలో జరిగిన వామపక్షాల‌ పార్టీ ...

Read More »

జాగృతి ఆధ్వర్యంలో వాలీబాల్‌ పోటీలు

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షుడు చిట్టిమ‌ల్ల‌ అనంత రాములు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ జన్మదినం పురస్కరించుకొని కెసిఆర్‌ కప్‌ 2021 ను తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ఆదేశాల‌ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల‌ 9, 10 తేదీలో కామారెడ్డి జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ సహకారంతో స్థానిక ...

Read More »

అదనపు చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారుల‌కు గ్యాస్‌ సరఫరా చేసే డెలివరీ బాయ్ ల‌‌కు అదనపు చార్జీలు చెల్లించ వల‌సిన అవసరం లేదని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌పిజి గ్యాస్‌ ఏజెన్సీ ద్వారా సరఫరా చేసే గ్యాస్‌ సిలిండర్లకు డెలివరీ బాయ్ లు బిల్లు ల‌ కంటే అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీలు డెలివరీ బాయ్ ల‌‌కు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాల‌ని ఆయన ఆదేశించారు. లేదంటే ...

Read More »

18 వరకు పిజి పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాల‌లోని ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌. ఎల్‌. బి., ఎల్‌.ఎల్‌.ఎం., ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల‌కు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ థియరీ, ప్రాక్టికల్‌ రెగ్యూల‌ర్‌ పరీక్ష తేదీ గడువు ఈ నెల 18 వరకు నిర్ణయించబడిరదని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. అంతేగాక ఈ నెల‌ 22 వ తేదీ 100 రూపాయలు, ఈ నెల‌ 25 వ తేదీ 500 ...

Read More »

శ్రామిక మహిళల‌కు ఆదర్శం కామ్రేడ్‌ వినోద

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పీ.వో.డబ్ల్యు జిల్లా నాయకురాలు కామ్రేడ్‌ వినోద సంతాప సభ ప్రగతిశీల మహిళా సంఘం (పీ.వో.డబ్ల్యూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్‌. ఆర్‌ భవన్‌, కోటగల్లీలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా పివోడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు గోదావరి, జిల్లా ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి మాట్లాడుతూ పేద ప్రజల‌ కోసం పోరాటాలు చేసే కుటుంబాల‌లోని శ్రామిక మహిళల‌కు ఆదర్శ ప్రాయురాలు కామ్రేడ్‌ డి.వినోద అని కొనియాడారు. పివోడబ్ల్యు జిల్లా కమిటి సభ్యురాలిగా పని చేసిన వినోద, ...

Read More »

8న జాబ్‌ మేళా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 8 వ తేదీన జిల్లా ఉపాధి కార్యాల‌యములో జాబ్‌ మేళా ఏర్పాటు చేసినట్టు జిల్లా ఉపాధి అధికారి యస్‌.శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్‌ మేళాకు నిజామాబాద్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆప్‌ ఇండియా (ఎల్‌ఐసి) నిజామాబాద్‌ జిల్లా మార్కెటింగ్‌ ఎడ్వైజర్‌ కోసం తెలిపారు. విద్యార్హత ఎస్‌ఎస్‌సి ఆ పైన, నయోపరిమితి 26 నుండి 50 సంవత్సరాల‌ వరకు ఉండవచ్చన్నారు. ఆసక్తి గల‌ అభ్యర్థులు ఉదయం 10 గంటల‌ నుండి మధ్యాహ్నం ...

Read More »

తెలంగాణ దీపస్తంభం వట్టికోట ఆళ్వారుస్వామి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ సాహిత్యానికి దీపస్తంభం అని హరిదా రచయితల‌ సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కేర్‌ డిగ్రీ కళాశాల‌లో జరిగిన వట్టికోట ఆల్వార్‌ స్వామి వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా జైలులో డాక్టర్‌ దాశరథితో కలిసి వట్టికోట ఆళ్వార్‌ స్వామి శిక్ష అనుభవించడం, జైలులో కూడా ధిక్కార స్వరాన్ని వినిపించడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో స్ఫూర్తిదాయక ఘట్టం అని ఆయన అన్నారు. ఆయన ...

Read More »