Breaking News

8న జాబ్‌ మేళా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 8 వ తేదీన జిల్లా ఉపాధి కార్యాల‌యములో జాబ్‌ మేళా ఏర్పాటు చేసినట్టు జిల్లా ఉపాధి అధికారి యస్‌.శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్‌ మేళాకు నిజామాబాద్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆప్‌ ఇండియా (ఎల్‌ఐసి) నిజామాబాద్‌ జిల్లా మార్కెటింగ్‌ ఎడ్వైజర్‌ కోసం తెలిపారు. విద్యార్హత ఎస్‌ఎస్‌సి ఆ పైన, నయోపరిమితి 26 నుండి 50 సంవత్సరాల‌ వరకు ఉండవచ్చన్నారు.

ఆసక్తి గల‌ అభ్యర్థులు ఉదయం 10 గంటల‌ నుండి మధ్యాహ్నం 2 గంటల‌ వరకు జిల్లా ఉపాధి కార్యాల‌యం శివాజీనగర్‌, నిజామాబాద్‌లో హాజరు కావాల‌న్నారు. రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫోటోలు, బయోడేటా ఫామ్‌ మరియు ఆధార్‌ కార్డుతో హాజరు కావాల‌ని పేర్కొన్నారు. పూర్తి వివరాల‌కు జిల్లా ఉపాధి కార్యాల‌యం ఫోన్‌ నెంబర్‌ 08462-224039, 8328046632, 9848237987 కి సంప్రదించవచ్చన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article