Breaking News

18 వరకు పిజి పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాల‌లోని ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌. ఎల్‌. బి., ఎల్‌.ఎల్‌.ఎం., ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల‌కు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ థియరీ, ప్రాక్టికల్‌ రెగ్యూల‌ర్‌ పరీక్ష తేదీ గడువు ఈ నెల 18 వరకు నిర్ణయించబడిరదని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

అంతేగాక ఈ నెల‌ 22 వ తేదీ 100 రూపాయలు, ఈ నెల‌ 25 వ తేదీ 500 రూపాయలు, మార్చి 2 వ తేదీ 1000 రూపాయలు, మార్చి 6 వ తేదీ 2000 రూపాయలు అదనపు రుసుముతో పరీక్ష పీజు చెల్లించవచ్చన్నారు. కావున పీజీ కళాశాల‌ల ప్రధానాచార్యులు మరియు విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాల‌న్నారు.

పూర్తి వివరాల‌ కోసం తెలంగాణ విశ్వవిద్యాల‌య వెబ్‌ సైట్‌ను సంప్రదించగల‌రని తెలిపారు.

Check Also

సిబ్బంది వివరాలు సేకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాల‌ను మండల‌ ...

Comment on the article