Breaking News

Daily Archives: February 6, 2021

సమిష్టి కృషి చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛ సర్వేక్షన్‌ కార్యక్రమాల‌లో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నివడానికి సమిష్టిగా కృషి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ కోరారు. కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద శనివారం స్వచ్ఛ సర్వేక్షన్‌ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాల‌ని సూచించారు. తడి, పొడి చెత్తను ప్రజలు వేరు చేసి చెత్త బండికి ఇవ్వాల‌ని పేర్కొన్నారు. ర్యాలీలో అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, మున్సిపల్‌ ...

Read More »

అభివృద్ధి పనుల‌కు మేయర్‌ భూమిపూజ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నగరంలోని 14,13,30,31,54 డివిజన్లలో సుమారు 58 ల‌క్షల‌ రూపాయల‌ నిధుల‌తో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల‌కు నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ఇద్రిస్‌ ఖాన్‌, ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ షకీల్‌, డివిజన్ల కార్పొరేటర్లు హరూన్‌, సలీం, మున్సిపల్‌ ఇంజినీర్లు ముస్తాక్‌ అహ్మద్‌, శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

8 నుండి గొర్రెలు, మేకల‌కు టీకాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 8వ తేదీ నుండి 20 వ తేదీ వరకు పశువైద్య మరియు పశు సంవర్దకశాఖ ఆద్వర్యంలో జిల్లాలో 66 శాతం గొర్రెలు, మేకల‌కు ఉచితంగా పిపిఆర్‌ టీకాలు ఇవ్వనున్నట్టు జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ యం.భరత్‌ తెలిపారు. టీకాలు జిల్లాలోని గొర్రెలు, మేకల‌ పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

Read More »

8న ఎన్‌ఎస్‌యుఐ మహాసభ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 8వ తేదీ సోమవారం నిజామాబాద్‌ నగరంలోని నూతన అంబేడ్కర్‌ భవన్‌లో ఎన్‌.ఎస్‌.యు.ఐ మహాసభ నిర్వహించనున్నామని, కార్యక్రమానికి ఎన్‌.ఎస్‌.యు.ఐ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్‌ నవీద్‌ ఖాన్‌, రాష్ట్ర అధ్యక్షుడు బ‌ల్మూర్‌ వెంకట్‌ హాజరవుతున్నారని ఎన్‌.ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్‌ అన్నారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్‌ కాంగ్రెస్‌ భవన్‌లో విలేకరుల‌తో మాట్లాడారు. మహాసభకు ఎన్‌.ఎస్‌.యు.ఐ నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల‌ని ...

Read More »

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఎల్లారెడ్డి మండల‌ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యం వద్ద మండలానికి చెందిన 9 మందికి ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బిల్లుల‌ను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 2 ల‌క్షల‌ 92 వేల‌ 500 రూపాయల‌ చెక్కుల‌ను ల‌బ్దిదారుల‌కు స్థానిక ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల‌ నాయకులు, మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిల‌ర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

రైతాంగ ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధ చర్యలు నశించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాల‌ను రద్దు చేయాల‌ని డిమాండ్‌ చేస్తూ శనివారం ఏఐకెఎస్‌సిసి దేశవ్యాప్త పిలుపు మేరకు రహదారుల‌ దిగ్బంధనం కార్యక్రమంలో భాగంగా రైతు సంఘాల‌ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బోర్గాం (పి) చౌరస్తా, నిజామాబాద్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు తాహెర్‌ బిన్‌ హందాన్‌, ఏఐకెఎస్‌ జిల్లా భాద్యులు పెద్ది వెంకట్రాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి ...

Read More »

క్రీడాకారుల‌ను ప్రోత్సహించాల‌నే వాలీబాల్‌ టోర్నమెంట్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈనెల‌ 9, 10 తేదీల‌లో పురుషుల‌ ఓపెన్‌ జిల్లా స్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నామని జాగృతి రాష్ట్ర కార్యదర్శి నరాల‌ సుధాకర్‌ తెలిపారు. శనివారం కలెక్టర్‌ గ్రౌండ్‌లో పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. జాగృతి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సేవ కార్యక్రమాలే కాక, క్రీడకారుల‌ను ప్రోత్సహించాల‌నే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని 33 జిల్లాలో ...

Read More »

గోడప్రతులు ఆవిష్కరించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో ఈ నెల‌ 9, 10 తేదీల‌లో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వాలి బాల్‌ కెసిఆర్‌ కప్‌ పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాల‌యంలో శనివారం జిల్లా తెలంగాణ జాగృతి బాధ్యుల‌తో కలిసి గోడ ప్రతుల‌ను ఆవిష్కరించారు. స్థానిక శిశు మందిర్‌ మైదానంలో ఓపెన్‌ టు ఆల్‌ నియమముతో, నాక్‌ అవుట్‌ పద్దతిలో పోటీలు జరుగనున్నాయన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారునికి వయసుతో ...

Read More »

15వ తేదీకి చివరి గడువు పొడిగింపు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని దివ్యాంగుల‌కు సహాయ ఉపకరణములు అందించటానికి వెబ్‌ సైట్‌ నందు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ లోపు సంబందిత అన్ని ద్రువపత్రముల‌తో దరఖాస్తు చేసుకోవాల‌ని ఇదివరకు పత్రికా ప్రకటన జారీచేసినట్టు మహిళ, శిశు, దివ్యాంగుల‌ మరియు వయో వృద్ధుల‌ శాఖ జిల్లా సంక్షేమ అధికారి ఝాన్సీ ల‌క్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. కానీ ప్రభుత్వ ఆదేశానుసారము ఇట్టి దరఖాస్తుల‌ స్వీకరణ చివరి తేదిని ఫిబ్రవరి 6 నుంచి 15వ ...

Read More »

ఎంపి అర్వింద్‌ చిత్రపటానికి పాలాభిషేకం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నగరంలోని ఏడో డివిజన్‌ బీజేపీ కార్పొరేటర్‌ మధు ఆధ్వర్యంలో పసుపు రైతుల‌కు మద్దతు ధర ప్రకటించినందుకు పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అరవింద్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన పసుపు ధర మద్దతు ఎక్కడలేని విధంగా ఏడు వేల‌ ఒక వంద రూపాయలు ధర ప్రకటించినందుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో యువత మరియు రైతులు చాలా సంతోష పడుతున్నారని అన్నారు. ...

Read More »

నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ల నియామకం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌ నూతన ఆర్థిక సంవత్సరం 1 ఏప్రిల్‌ 2021 నుండి రాబోయే ఏడాది కోసం నూతన వాలంటీర్ల నియామకం చేపడుతుందని, జిల్లా స్థాయిలో ఇంటర్వ్యూ ద్వారా వాలంటీర్లను ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాలంటీర్లకు నెల‌కి 5 వేల‌ రూపాయల‌ గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హతలు : 1. కనీస విద్యార్హత 10వతరగతి పాసై ఉండాలి. 2. ...

Read More »