Breaking News

రైతాంగ ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధ చర్యలు నశించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాల‌ను రద్దు చేయాల‌ని డిమాండ్‌ చేస్తూ శనివారం ఏఐకెఎస్‌సిసి దేశవ్యాప్త పిలుపు మేరకు రహదారుల‌ దిగ్బంధనం కార్యక్రమంలో భాగంగా రైతు సంఘాల‌ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బోర్గాం (పి) చౌరస్తా, నిజామాబాద్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు తాహెర్‌ బిన్‌ హందాన్‌, ఏఐకెఎస్‌ జిల్లా భాద్యులు పెద్ది వెంకట్రాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమ‌న్న‌ మాట్లాడుతూ రైతాంగ ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధ చర్యలు నశించాల‌న్నారు.

 

భారత రైతాంగ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా సానుభూతి ల‌భిస్తుందన్నారు. దీంతో రైతాంగ ఉద్యమంపై మోడీ, అమిత్‌ షా వారి భజన మండలి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కుట్రను మానుకోవాల‌న్నారు. రైతు ఉద్యమాన్ని విచ్చిన్నం చేయాల‌ని మోడీ ప్రభుత్వం అనేక కుట్రలు పన్నిందన్నారు. అయితే ప్రభుత్వ కుట్రల‌ను రైతాంగ ఉద్యమం వమ్ము చేస్తుందన్నారు. ఇప్పటికే రైతు ఉద్యమం అన్ని రాష్ట్రాల‌కు వేగంగా పాకిందన్నారు.

బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రైతు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందన్నారు. డిల్లీ రైతాంగ ఉద్యమం పిలుపు దేశవ్యాప్తంగా జయప్రదం అవుతున్నాయన్నారు. రైతు చట్టాల‌ను రద్దు చేయడం మినహా మోడీ ప్రభుత్వానికి మరోమార్గం లేదన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చట్టాల‌ను రద్దు చేయాల‌న్నారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం ఆగదన్నారు. రాస్తారోకోతో భారీగా వాహనాలు స్తంభించిపోయాయి.

కార్యక్రమంలో ఏఐకెఎంఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ, ఏఐకెఎస్‌ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేష్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు, జేఏసీ కన్వీనర్‌ భాస్కర్‌, ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు పాపయ్య, భాస్కర్‌, భూమన్న, సాయగౌడ్‌, రాజన్న, నూర్జహాన్‌, ల‌త, సుధాకర్‌, ఓమయ్యా, గోవర్ధన్‌, సుధాకర్‌, రఘురాం, అనిల్‌, విగ్నేష్‌, రంజిత్‌, గంగాధర్‌, మురళి, మహేష్‌, మారుతి, రాజేశ్వర్‌, సాయికృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article