నిజామాబాద్, ఫిబ్రవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేర్ ఫుట్‌బాల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 13 కేర్ ఫుట్‌బాల్ అకాడమీ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో ముఖ్యఅతిథిగా అడిషనల్ డిసిపి అరవింద్ బాబు పాల్గొని ఫుట్‌బాల్ ఆట ప్రోత్సహిస్తున్న కేర్ ఫుట్‌బాల్ అకాడమి నిర్వాహకులను అభినందించారు. ముఖ్యంగా కోచ్ నాగరాజు తన జీవితాన్ని మొత్తం ఫుట్‌బాల్‌కు అంకితం చేసి ఫుట్‌బాల్ ప్లేయర్ లను తయారు చేయడం గొప్ప విషయమని కొనియాడారు.
ఆటలు ఆడిన ప్రతి ఒక్కరు జీవితంలో విజయం సాధించారని ఆటతోపాటు చదువుకు విలువ ఇచ్చిన ప్రతి ఒక్కరూ జీవితంలో తమ తమ గమ్యాలను సునాయాసంగా చేరుకున్నారని అన్నారు. తాను కూడా ఒక ఆటగాడినేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫుట్‌బాల్ ఆటకు సహకరిస్తున్న నిజామాబాద్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు షకీల్ మరియు ఖలీల్ ను అభినందించారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన సోనూసూద్ క్లబ్‌కు మరియు రెండవ విజేతగా (రన్నరప్‌గా) నిలిచిన ఎస్ఎస్ స్పోర్ట్స్ క్లబ్ కు బహుమతులను అరవింద్ బాబు అందజేశారు.
మూడవ స్థానం వచ్చిన బోర్గాం ఫుట్‌బాల్ క్లబ్‌కు మరియు నాలుగవ స్థానం వచ్చిన గంగారెడ్డి ఫుట్‌బాల్ క్లబ్ కు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. అదే విధంగా మొత్తం 50 మ్యాచులు నిర్వహించి ఆదివారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు బహుమతులు అందజేశారు. ఉత్తమ నూతన ఆటగాళ్లుగ సుశాంతిక, సుశాంత్‌లకు అవార్డు లభించగా, ఉత్తమ డిఫెన్స్ ఆటగాళ్లుగా మోక్ష అక్షిత లకు అవార్డులు లభించాయి.
ఉత్తమ ఆటగాడుగా హృషికేష్ ఉత్తమ గోల్‌కీపర్‌గా శ్రీ చరణ్ అవార్డు అందుకున్నారు. కేర్ ఫుట్‌బాల్ అకాడమీ నుండి ఒక అంతర్జాతీయ క్రీడాకారిణి 40 మంది జాతీయ క్రీడాకారులు ఇద్దరు క్లబ్ క్రీడాకారులు తయారుకావడం గొప్ప విషయమన్నారు.
ఇంత చిన్న మైదానం నుండి ఇంత మంది ఆటగాళ్లను తయారు చేస్తున్న కేర్ ఫుట్‌బాల్ అకాడమీ నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అరవింద్ బాబుతో పాటు కేర్ ఫుట్‌బాల్ అకాడమీ అధ్యక్షుడు నరాల సుధాకర్, నిజామాబాద్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు షఖిల్, ఖలీల్ సీనియర్ ఫుట్‌బాల్ ప్లేయర్ ఇన్స్పెక్టర్ సురేష్, కోచ్ గొట్టిపాటి నాగరాజు, గిరి తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021