Breaking News

Daily Archives: February 8, 2021

రక్తహీనతతో బాధపడుతున్న యువకుడికి రక్తదానం

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ల‌క్ష్మి వైద్యశాల‌లో చిలుక రమేష్‌ ఉప్పల్‌ వాయి గ్రామానికి చెందిన 31 సంవత్సరాల‌ వయసు కలిగిన యువకుడు రక్తహీనతతో బాధ పడుతుడండముతో చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన సురేష్‌ ముందుకు వచ్చి ఓ పాజిటివ్‌ రక్తం అందించి ప్రాణాల‌ను కాపాడినట్లు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. గతంలో చాలాసార్లు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తాన్ని అందజేసిన రక్తదాత సురేష్‌ను అభినందించారు. రక్తదానం చేయడానికి యువకులు ...

Read More »

ఫోన్‌ ఇన్‌లో 32 ఫిర్యాదులు

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా జిల్లా గ్రామాణాభివృద్ది అధికారి చంద్రమోహన్‌ రెడ్డి 32 ఫిర్యాదుల‌ను స్వీకరించారు. రెవెన్యూ 11, జిల్లా పంచాయితీ అధికారి 13, విద్యాశాఖ 1, నీటిపారుదల‌ శాఖ 2, వ్యవసాయ శాఖ 2, పౌరసరఫరాలు 1, పోలీసు 1, విద్యుత్‌ శాఖ 1 చొప్పున ఫిర్యాదుల‌ను స్వీకరించడం జరిగింది. ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read More »

పారుడు వ్యాధి రాకుండా నివారణ టీకాలు

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పారుడు వ్యాధి రాకుండా నివారణ టీకాల‌ను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని, గొర్రెలు మేకల‌ పెంపకం దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బీబీపేట మండలం తుజల్‌ పూర్‌ లో గొర్రెలు, మేకల‌కు పారుడు వ్యాధి రాకుండా నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డిడిలు చెల్లించిన ల‌బ్ధిదారుల‌కు రెండో విడతలో గొర్రెల‌ పంపిణీ చేస్తామని చెప్పారు. రైతులు వ్యవసాయంతో పాటు ...

Read More »

గ్రామపంచాయతీలో వెయ్యి మొక్కలు నాటాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 17న ప్రతి గ్రామపంచాయతీలో వెయ్యి మొక్కల చొప్పున నాటడానికి అన్ని చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుండి సంబంధిత అధికారుల‌తో సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా మొక్కలు నాటే కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన ప్రకారం అన్ని గ్రామ పంచాయతీల‌లో వెయ్యి చొప్పున నాటించడానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. మొక్కలు నాటడమే ...

Read More »

గార్డెన్‌ సమస్యల‌పై వాకబు చేసిన మేయర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని తిల‌క్‌ గార్డెన్‌ను నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ సందర్శించి ప్రతి రోజు వాకింగ్‌కు వచ్చే వారితో కలియ తిరుగుతూ అక్కడ ఉన్న వారి సమస్యల‌పై వాకబు చేశారు. చాలా మట్టుకు సమస్యల‌ను మున్సిపల్‌ వారు పరిష్కరించ్చారని వాకర్స్‌ తెలిపారు. అక్కడే ఉన్న ఓపెన్‌ జిమ్‌లో వ్యాయామం చేస్తున్న ప్రజల‌తో మేయర్‌ మాట్లాడుతూ ఓపెన్‌ జిమ్‌ ఎలా ఉందని అడిగారు. ప్రజలు స్పందిస్తూ చాలా బాగుందని అందరికి సౌకర్యంగా ఉన్నదని తెలుపుతూ ...

Read More »

టీయూ స్పోర్ట్స్‌ ఇంచార్జ్‌గా డా. మహ్మద్‌ అబ్దుల్‌ ఖవి

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని ఉర్దూ విభాగపు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. మహ్మద్‌ అబ్దుల్‌ ఖవి యూత్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, స్పోర్ట్స్‌ ఇంచార్జ్‌గా నియమింపబడ్డారు. ఉపకుల‌పతి నీతూ కుమారి ప్రసాద్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం నియామక ఉత్తర్వుల‌ను డా. మహ్మద్‌ అబ్దుల్‌ ఖవికి సోమవారం అందించారు. ఆయన ఇదివరకు అడిషనల్‌ పరీక్షల నియంత్రణాధికారిగా, హాస్టల్స్‌ చీఫ్‌ వార్డెన్‌గా, బాలుర హాస్టల్‌ వార్డెన్‌గా, అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌గా, ఉర్దూ విభాగపు బిఓఎస్‌గా పదవులు నిర్వర్తించారు. ...

Read More »

ప్రశాంతంగా ప్రారంభమైన కేయూ డిస్టెన్స్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిద్‌ – 19 నిబంధనల‌ను అనుసరించి తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని యూనివర్సిటీ కళాశాల‌ కేంద్రంగా కాకతీయ విశ్వవిద్యాల‌య దూర అభ్యసనం మరియు నిరంతర విద్య (స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ర్నింగ్‌ అండ్‌ కంటిన్యుంగ్‌ ఎడ్యుకేషన్‌) కేంద్రానికి సంబంధించి డిగ్రీ మరియు పీజీ పరీక్షలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కాకతీయ విశ్వవిద్యాల‌యం పరీక్షల‌ అధికారి ఆచార్య మహేందర్‌ రెడ్డి ఆదేశాల‌ అనుసారం తెలంగాణ విశ్వవిద్యాల‌య పరీక్షల‌ అధికారి డా. పాత నాగరాజు దూరవిద్యా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ...

Read More »

స్కూలు, కాలేజీ ఫీజుల్లో 50 శాతం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్కూలు, కాలేజీ ఫీజుల్లో 50 శాతం, హాస్టల్‌ వసతి ఉన్నన్ని రోజుల‌కే హాస్టల్‌ ఫీజు ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు వసూలు చేయాల‌ని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ క‌ల్ప‌న మాట్లాడుతూ విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో లాభార్జనే ధ్యేయంగా ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఫీజు వసూళ్లకు ...

Read More »

20 26 జీవో వెంటనే రద్దు చేయాలి

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీ కార్మికుల‌కు ప్రభుత్వ పాఠశాల‌ల మరుగుదొడ్లు శుభ్రం చేయాల‌ని జీవో నెంబర్‌ 20 26ను రద్దుచేసి పంచాయతీ కార్మికుల‌ పని భారాన్ని తగ్గించాల‌ని తెలంగాణ ప్రగతిశీల‌ గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టియు నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు డిమాండ్‌ చేశారు. జక్రాన్‌ పల్లి మండల‌ కేంద్రంలో ధర్నా నిర్వహించి ఎంపీడీవోకి వినతి పత్రం అందజేశారు. పంచాయతీ కార్మికుల‌కు వేతనం తక్కువ, చాకిరీ ఎక్కువని, పంచాయతీ కార్మికుల‌ను మనుషుల్లాగా కాకుండా బానిసలుగా ప్రభుత్వం ...

Read More »

మెడికల్‌ కళాశాల‌లో కాంట్రాక్టు పోస్టులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల‌ / ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌, నిజామాబాద్‌లో సీనియర్‌ రెసిడెంట్‌, జూనియర్‌ రెసిడెంట్‌ వైద్యుల‌ పోస్టుల‌ను భర్తీ చేయటానికి కాంట్రక్ట్‌ పద్ధతిలో ఒక సంవత్సర కాల‌ము నియమించుటకు వైద్య విద్య సంచాల‌కులు తెలంగాణ, హైదరాబాద్‌ అనుమతి ఇచ్చినట్టు మెడికల్‌ కళాశాల‌ ప్రధానాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల‌వారు ఈనెల‌ 9వ తేదీ నుంచి 16 వరకు దరఖాస్తుల‌ను ప్రధాన ఆచార్యులు, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల‌ కార్యాల‌యములో అందజేయాల‌ని ...

Read More »

9న జాబ్‌మేళా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని నిరుద్యోగుల‌కు ఈనెల‌ 9వ తేదీ జిల్లా ఉపాధి కార్యాల‌యములో జాబ్‌ మేళా జరుగుతుందని, ఇట్టి జాబ్‌ మేళాకు హైదరాబాద్‌ నుండి శ్రీ విజయ బయో ఫెర్టిలైజర్స్‌ వారు నిజామాబాద్‌ జిల్లాలో 80 సెల్స్‌ రిప్రజంటివ్‌ కోసం ఎంపిక నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి యస్‌. శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్హతలు ఇంటర్‌ ఆ పైన, వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాల‌ వరకు, వేతనము 9 వేల‌ 100 రూపాయలు ...

Read More »

ప్రారంభమైన వ్యాధి నివారణ టీకాల‌ కార్యక్రమం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉచిత పిపిఆర్‌ వ్యాధి నివారణ టీకాల‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం మిర్దాపల్లి, దేగాం గ్రామాల్లో జీవాల‌లో ఉచిత పిపిఆర్‌ టీకాల‌ కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో రెండు గ్రామాల‌ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ నాయకులు పాల్గొని జీవాల‌కు మొదట టీకా వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు గ్రామాల్లో పశువైద్య సిబ్బంది రాజేశ్వర్‌, సురేష్‌, నాగార్జున కలిసి జీవాల‌కు టీకాలు వేశారని ఆర్మూర్‌ మండల‌ పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌. ల‌క్కం ప్రభాకర్‌ తెలిపారు. ...

Read More »