జక్రాన్పల్లి, ఫిబ్రవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వ పాఠశాలల మరుగుదొడ్లు శుభ్రం చేయాలని జీవో నెంబర్ 20 26ను రద్దుచేసి పంచాయతీ కార్మికుల పని భారాన్ని తగ్గించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. జక్రాన్ పల్లి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి ఎంపీడీవోకి వినతి పత్రం అందజేశారు.
పంచాయతీ కార్మికులకు వేతనం తక్కువ, చాకిరీ ఎక్కువని, పంచాయతీ కార్మికులను మనుషుల్లాగా కాకుండా బానిసలుగా ప్రభుత్వం చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సఫాయి కార్మికులు దేవుళ్ళని దండం పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం, కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకోవడం సరికాదని వెంటనే జీవో నెంబర్20 26 ను రద్దు చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కార్యక్రమంలో జక్రాన్పల్లి మండల కమిటీ అధ్యక్షుడు చొప్పరి గంగాధర్, ఆసిఫ్, నాగమణి, రాజ గంగు, మజ్జు, యాటకర్ల శ్రీనివాస్, భాను, సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు – పలు అంశాలపై సమీక్ష - March 2, 2021
- టీయూ ఐక్యూఎసీ డైరెక్టర్గా ఆచార్య కౌసర్ మహ్మద్ - March 2, 2021
- ‘‘డైరెక్ట్ టాక్సెస్’’ పుస్తకావిష్కరణ - March 2, 2021