Breaking News

మెడికల్‌ కళాశాల‌లో కాంట్రాక్టు పోస్టులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల‌ / ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌, నిజామాబాద్‌లో సీనియర్‌ రెసిడెంట్‌, జూనియర్‌ రెసిడెంట్‌ వైద్యుల‌ పోస్టుల‌ను భర్తీ చేయటానికి కాంట్రక్ట్‌ పద్ధతిలో ఒక సంవత్సర కాల‌ము నియమించుటకు వైద్య విద్య సంచాల‌కులు తెలంగాణ, హైదరాబాద్‌ అనుమతి ఇచ్చినట్టు మెడికల్‌ కళాశాల‌ ప్రధానాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆసక్తి గల‌వారు ఈనెల‌ 9వ తేదీ నుంచి 16 వరకు దరఖాస్తుల‌ను ప్రధాన ఆచార్యులు, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల‌ కార్యాల‌యములో అందజేయాల‌ని కోరారు. అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) కార్యాల‌యం నందు ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 3 గంటల‌కు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. అప్లికేషన్‌ ఫారాలు, గైడ్‌ లైన్స్‌ కళాశాల‌ వెబ్‌ సైట్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవాల‌న్నారు. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టు ఖాళీలు (26) వేతనము అన్ని కలిపి రూ.70 వేలు ఉంటుందన్నారు.

నియామకానికి సంబంధిత శాఖలో ఎం.డి/ఎం.ఎస్‌/డి.యెన్‌.బి, ఎం.సి.ఐ గుర్తింపు పొందిన కళాశాల‌ నుండి కలిగి ఉండాల‌ని, తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌ కలిగి ఉండాల‌న్నారు. వయసు : 31/07/2021 నాటికీ 44 సంవత్సరాల‌ లోపు వయసు కలిగి ఉండాల‌న్నారు.

(1) జనరల్‌ మెడిసిన్‌-04 (2) డివిఎల్‌-01 (3) సైకియాట్రీ 01, (4) పీడీయాట్‌ రిక్స్‌-07 (5) జనరల్‌ సర్జరీ -02 (6) ఓ బి జి వై-02, (7) ఎమర్జెన్సీ మెడిసిన్‌-03 ఎం. డి అనేస్తేషియాజి, ఎం.డి జనరల్‌ మెడిసిన్‌ కాండిడేట్లు ఎలిజబుల్‌ (8) హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌-02, (9) కమ్యూనిటీ మెడిసిన్‌ 04, జూనియర్‌ రెసిడెంట్‌ – పోస్ట్‌ ఖాళీు- 09, వేతనము పే స్కేలు రూ, 15 వేల‌ 600 డి ఏ. 1.ఎం.బి.బి. ఎస్‌ డిగ్రీ కల‌ వారిని తీసుకోబడుతుందన్నారు.

ఎం.సి.ఐ గుర్తింపు పొందిన కళాశాల‌ నుండి కలిగి ఉండాల‌ని, తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌ కలిగి ఉండాల‌న్నారు. వయను : 31/07/2021 నాటికి 39 సంవత్సరాల‌ లోపు వయసు కలిగి ఉండాల‌న్నారు. అప్లికేషన్‌ మరియు గైడ్‌ లైన్స్‌ కళాశా ల‌వెబ్‌ సైట్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

Check Also

సంగీతకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం తెలుగు అధ్యయనశాఖ పరిశోధక విద్యార్థి ఆర్‌. ...

Comment on the article