కామారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న కెసిఆర్ కప్ వాలీబాల్ క్రీడలు బుధవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ పోటీలు జరిగాయి. సెమీఫైనల్స్‌లో తాడ్వాయి, యన్యన్ స్పోర్ట్స్ కామారెడ్డి జట్లు తలపడ్డాయి.ఫైనల్స్‌లో రెండు జట్లు మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. మొదటి స్థానంలో విజేతగా నిలిచిన తాడ్వాయి జట్టుకు కెసిఆర్ కప్‌తో పాటు 20 వేల నగదు బహుమతిని, కప్ ను, మెడల్స్‌ను, ద్వితీయ స్థానంలో ...
Read More »Daily Archives: February 10, 2021
పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్ఎస్ను ఓడించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని మాయమాటలు చెప్పి మోసం చేశారని రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ ఉద్యోగాల కల్పనలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటివరకు గ్రూప్ 1, జెఎల్, డిఎల్, డైట్ అధ్యాపకుల నియామకాలు చేయలేదని, రాష్ట్రంలో లక్షలాది ఖాళీలు ఉంటే ...
Read More »సమాన పనికి సమాన వేతనం కావాలి
బోధన్, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పారిశుధ్ద్య రంగంలో పని చేస్తున్న కార్మికులను పాలకులు వారి పాదాలను కడిగి ఒకరు, వారు దేవుళ్ళని మరొకరు పొగడ్తతో ముంచెత్తుతున్నారని, వారి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వడం లేదని తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర నాయకులు బి మల్లేష్ మండి పడ్డారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ మున్సిపల్ కార్యాలయం ముందు తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ...
Read More »సిసి రోడ్డు పనులు ప్రారంభించిన మేయర్
నిజామాబాద్, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 46వ డివిజన్ పులాంగ్ వద్ద పట్టణ ప్రగతి 10 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ అక్బర్ హుస్సేన్‌తో కలిసి నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ధర్మపురి, శ్రీనివాస్ రెడ్డి, రైసింగ్, శివ చరణ్, వెల్డింగ్ నారాయణ, నుడా డైరెక్టర్ బాలాజీ, అక్తర్, తెరాస నాయకులు అరుణ్, మరియు పులాంగ్ డెవలప్మెంట్ కమిటి అధ్యక్షుడు ఖాన్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Read More »ఈనెల 12 నుండి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
నిజామాబాద్, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేషనల్ హెల్త్ మిషన్ పాలియేటివ్ కేర్ ప్రోగ్రాం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిజామబాద్‌లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేయటానికి ఫిజిషియన్ / మెడికల్ ఆఫీసర్ పోస్టు ఖాళీలు (1) ఉన్నట్టు జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు విద్యార్హత : ఎం.డి. జనరల్ మెడిసిన్ లేదా ఎం.బి.బి.ఎస్. మరియు పాలియేటివ్ సర్టిఫికెట్ కోర్సు కలిగి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిష్టర్ చేయబడి ఉండాలన్నారు. హానరోరియం ...
Read More »స్పీకర్‌కు మంత్రి జన్మదిన శుభాకాంక్షలు
నిజామాబాద్, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి 73వ జన్మధినం సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ అధికార నివాసంలో మంత్రి వేముల స్పీకర్‌కి పుష్ప గుచ్చం అందించారు. ఈ సందర్భంగా స్పీకర్ కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎంఎల్‌సి వీజీ గౌడ్, శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా ...
Read More »కార్మికుల వేతనాలు పెంచాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులందరికీ వెంటనే వేతనాలు పెంచాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్.ఎం.ఆర్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని తదితర డిమాండ్లతో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎం.హెచ్.వోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో సుమారు 40 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరందరికీ వేతనాలు పెంచాల్సి వున్నా, ...
Read More »