Breaking News

తాడ్వాయి జట్టుకు కెసిఆర్‌ కప్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న కెసిఆర్‌ కప్‌ వాలీబాల్‌ క్రీడలు బుధవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌ పోటీలు జరిగాయి. సెమీఫైనల్స్‌లో తాడ్వాయి, యన్‌యన్‌ స్పోర్ట్స్‌ కామారెడ్డి జట్లు తల‌పడ్డాయి.ఫైనల్స్‌లో రెండు జట్లు మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది.

మొదటి స్థానంలో విజేతగా నిలిచిన తాడ్వాయి జట్టుకు కెసిఆర్‌ కప్‌తో పాటు 20 వేల‌ నగదు బహుమతిని, కప్‌ ను, మెడల్స్‌ను, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు కెసిఆర్‌ కప్‌తో పాటు 10 వేల‌ నగదు, కప్‌, మెడల్స్‌ను బహుమతిగా అందజేశారు. కార్యమానికి ముఖ్య అతిథిగా మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఇందు ప్రియ, విశిష్ట అతిథిగా జాగృతి వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ గాంధేయవాది, జోగినిపల్లి శ్రీనివాస రావు, తాడ్వాయి సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ కృష్ణ మూర్తి హాజరై విజేతల‌కు బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో జాగృతి అధ్యక్షులు చిట్టిమ‌ల్ల అనంత రాములు, సత్యనారాయణ, వెంకట్‌ రెడ్డి, రమణా రావు, బాల‌రాజు, శ్రీరాం వెంకటేష్‌, చక్రధర్‌, నరేష్‌, అవుసుల‌ రాజు, నవీన్‌ రెడ్డి, సంగా గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

టగ్‌ ఆఫ్‌ వార్‌లో జాతీయస్థాయికి

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా దోమకొండ మండల‌ కేంద్రంలోని బాలుర ఉన్నతపాఠశాల‌ ...

Comment on the article