Breaking News

తల‌సేమియా బాధిత చిన్నారుల‌కు అండగా తెలంగాణ జాగృతి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన వచ్చింది. దాదాపు వంద మంది యువకులు రక్తదానం చేయడం గొప్ప విషయమని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావు అన్నారు.

నిజామాబాద్‌ నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాల‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ తల‌సేమియా బాధిత చిన్నారుల‌కు అండగా తెలంగాణ జాగృతి నిల‌బడుతుందన్నారు. నిజామాబాద్‌ నగరంలో గురువారం కేర్‌ ఫిజియోథెరపీ క్లినిక్‌, కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ సౌజన్యంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముందుకొచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.

రక్తదాన శిబిరాలు ఇదివరకు ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ తల‌సేమియా బాధిత చిన్నారుల‌కు నేరుగా రక్తదానం చేయడం అనేది చాలా తృప్తిని ఇచ్చిందన్నారు. తల‌సేమియా రక్తదాన శిబిరాల‌ ఇన్చార్జ్‌ జలీల్‌ మాట్లాడుతూ తమ టిఎస్‌సిఎస్‌ సంస్థలో 2 వేల‌ 800 మంది తల‌సేమియా బాధిత చిన్నారులు సభ్యత్వం ఉన్నారని వీరికి ప్రతి రోజూ దాదాపు 100 నుండి 150 యూనిట్ల రక్తం అవసరం పడుతుంది కాబట్టి రక్త దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసి చిన్నారుల‌ను ఆదుకోవాల‌ని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ జాగృతి సహకారం మరువలేనిదని, ఇకముందు కూడా తెలంగాణ జాగృతి సహకారం తమకు ఉంటుందని హామీ ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు అవంతికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి వేదిక అయిన కేర్‌ డిగ్రీ కళాశాల‌ డైరెక్టర్‌ నరాల‌ సుధాకర్‌ మాట్లాడుతూ తల‌సేమియా బాధిత చిన్నారుల‌కు టిఎస్‌సిఎస్‌ సంస్థకు తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పారు.

ఒక్క 100 యూనిట్ల రక్తం సేకరించడానికి దాదాపు రెండు ల‌క్షల‌ రూపాయల‌ను తమ సంస్థ నుండి ఖర్చుపెట్టి ఇటువంటి కార్యక్రమాల‌ను చేపట్టిన టిఎస్‌సిఎస్‌ సంస్థ సభ్యులు అభినందనీయుల‌న్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఆకుల‌ రవి, కోచ్‌ నాగరాజు, అపర్ణ, రామకృష్ణ, పురుషోత్తం, ప్రశాంత్‌, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాష్ట్ర మహాసభ జయప్రదం చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రగతిశీల‌ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో ...

Comment on the article