ఏకాత్మతా మానవతా వాదంతో ముందుకెళ్ళాలి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ 53వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి బిజెపి సీనియర్‌ నాయకులు పుప్పాల‌ శివరాజ్‌ కుమార్‌, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి నరసింహారెడ్డి పాల్గొని పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ ఏకాత్మతా మానవతావాదం అనే సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చి భారతీయ జనసంఘ్‌లో విశిష్టమైనటువంటి సేవ‌లు నిర్వహించారని, అప్పటి కాంగ్రెస్‌ నాయకులు మరియు నెహ్రూ యొక్క ముస్లిం సంతుష్టీకరణ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించి హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని రక్షించాలంటూ నినదించారన్నారు.

భారతజాతి యొక్క ప్రతి అభివృద్ధి కార్యక్రమం గుండె గుండెకు గుడిసె గుడిసెకు ప్రతి పేదవానికి దేశం యొక్క ప్రయోజనాలు అభివృద్ధి ఫలాలు అందాల‌ని వారు కృషి చేశారని పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ భారత దేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేయడమే కాకుండా భారతదేశం యొక్క అభివృద్ధి ఫలాల‌ను ఈ ప్రక్రియలో భాగంగానే సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ సబ్‌ కా విశ్వాస్‌ తో మోడీ సఫలీకృతం అవుతున్నారన్నారు.

నరేంద్ర మోడీ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ ఏకాత్మతా మానవతా వాదాన్ని పునికి పుచ్చుకుని తన యొక్క కార్యాన్ని నిర్వహిస్తున్నారని, అదే విధంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏకాత్మతా మానవతావాదం తోనే ముందుకు వెళుతూ పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ అడుగుజాడల్లో నడిచే అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కార్యక్రమంలో బిజెపి, వివిధ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

ఆర్మూర్‌లో పోలీసు కళాజాత

ఆర్మూర్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల‌ మేరకు పోలీసు ...

Comment on the article