Breaking News

నిజామాబాద్‌లో సాంస్కృతిక పోటీలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ పిలుపుమేరకు హరిదా రచయితల ‌సంఘం ఆధ్వర్యంలో కళాశాల‌ విద్యార్థుల‌కు, పాఠశాల‌ విద్యార్థుల‌కు కోటి వృక్ష అర్చన (హరితహారం) అంశంపై కవి సమ్మేళనం, ఉపన్యాస పోటీ, వ్యాసరచన పోటీ, చిత్రలేఖనం, పాటల‌ పోటీ నిర్వహిస్తున్నట్లు హరిదా రచయిత సంఘం అధికార ప్రతినిధి నరాల‌ సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

కవి సమ్మేళనం ఫిబ్రవరి 14 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల‌కు జిల్లా కేంద్ర గ్రంథాల‌యంలో జరుగుతుందని, ఫిబ్రవరి 15 సోమవారం ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖన, పాటల‌ పోటీలు కేర్‌ డిగ్రీ కళాశాల‌లో నిర్వహిస్తామని, ఫిబ్రవరి 17న జిల్లా కేంద్ర గ్రంథాయంలో బహుమతి ప్రదాన సభ ఉంటుందని ఆయన తెలిపారు.

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article