నిజామాబాద్, ఫిబ్రవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్:19 వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న వారు 13 ఫిబ్రవరి రోజు రెండవ డోస్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా జనరల్ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ చివరి రోజున జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, డిఆర్డిఓ వ్యాక్సిన్ తీసుకున్నారు. అంతకుముందు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో సంబంధిత అధికారులతో వ్యాక్సినేషన్ జరుగుతున్న విషయాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు జనవరి 16న తీసుకున్న 180 మంది ఫ్రంట్ లైన్ వారికి 13 న రెండవ డోసు తప్పక తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా రోజువారీగా మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత తప్పక రెండో వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు.
వ్యాక్సిన్ తీసుకునే వారిని ముందు రోజు అలర్ట్ చేయాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ సమయంలో విద్యుత్తు తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. లైన్ డిపార్ట్మెంట్స్ సహకారం తప్పక ఉండాలన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఎంహెచ్వో సుదర్శనం, జి జి హెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇందిరా, డిఆర్డిఓ శ్రీనివాస్, డిపిఓ జయసుధ, ఐసిడిఎస్ ఝాన్సీ డాక్టర్ శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021