నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని ఆర్మూడ్ రిజర్వు సిబ్బందికి మోబలైజేషన్ శిక్షణ ముగింవు కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిధులుగా పోలీస్ కమీషనర్ కార్తీకేయ హాజరయ్యారు. ముందుగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిపి కార్తికేయ మాట్లాడుతూ ఆర్మ్డ్ బందోబస్తులో సిబ్బంది అందరూ బాగా విధులు నిర్వహించారని ప్రతి ఒక్కరిని అభినందించారు. ఫిబ్రవరి 1 నుండి 13వ వరకు మోబైలేజేషన్ శిక్షణ నిర్వహించడం జరిగిందని శిక్షణ కాలంలో ఫిజికల్ ఎక్సర్సైజ్, ...
Read More »Daily Archives: February 13, 2021
ఘనంగా జాతీయ మహిళా దినోత్సవం
కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్ కస్తూర్బా బాలిక విద్యాలయంలో విద్యాలయ ప్రత్యేక అధికారి టి.లావణ్య అధ్యక్షతన అఖిల భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవం, సరోజినీ నాయుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవునిపల్లి ఎస్ఐ జ్యోతిని, కస్తూర్బా విద్యాలయప్రత్యేక అధికారి లావణ్యని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించినట్టు కామారెడ్డి జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్ రావు తెలిపారు. కార్యక్రమానికి ...
Read More »17న కోటి వృక్షార్చన
కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 17న కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని అమరవీరుల స్తూపం సమీపంలో మొక్కలు నాటడానికి ఖాళీ స్థలాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ శనివారం పరిశీలించారు. గుంతలు తీయించి సిద్ధం చేయాలని, అవసరమైన మొక్కలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ను ఆదేశించారు.
Read More »17న మొక్కలు నాటాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా సదాశివనగర్ మండల కేంద్రంలోని కొత్త చెరువు కట్టను శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. చెరువు కట్ట ఇరువైపులా ఈత మొక్కలు నాటాలని సూచించారు. ఈ నెల 17న మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని గ్రామపంచాయతీ, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డిఓ ...
Read More »బిసిల అభివృద్దిని పట్టించుకునే సమయం ప్రభుత్వానికి లేదు
ఆర్మూర్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టిఆర్ఎస్ సర్కారుకు బీసీ ఓట్ల పై ఉన్న ప్రేమ వారి అభివృద్ధిపై ఏమాత్రం లేదని, టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడు సంవత్సరాల్లో బీసీల విద్య, ఉద్యోగం, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి ఎలాంటి చర్యులు తీసుకోవడం లేదని, బీసీల అభివృద్ధి పట్టించుకునే సమయం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్ కుమార్, బీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు బాశెట్టి రాజ్ కుమార్ అన్నారు. ...
Read More »వచ్చిన మంచి పేరును నిలుపుకుంటూ సేవలను విస్తృతం చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ సందర్భంగా అందించిన సేవలకు గాను ప్రజల నుండి వచ్చిన మంచి పేరును, ప్రశంసను నిలుపుకుంటూ కెసిఆర్ కిట్ ద్వారా పెరిగిన డెలివరీ సంఖ్యకు నాణ్యతను జోడిస్తూ సేవలు మరింత విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్యాధికారులను కోరారు. శనివారం నుండి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యాధికారులకు సిబ్బందికి మూడు రోజులపాటు నిర్వహించే ‘‘దక్షత’’ శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో పని ...
Read More »12 కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో 12 కొత్త బార్లకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో 7, ఆర్మూరు మున్సిపాలిటీ 1, భీంగల్ మున్సిపాలిటీ 1, బోధన్ మున్సిపాలిటీ 3 బార్లకు కొత్తగా నోటిఫికేషన్ వెలువరించారు. దరఖాస్తు దాఖలు చేయటానికి ఈనెల 16వ తేదీ చివరి తేదీ అని, డ్రా 18వ తేదీన ప్రగతిభవన్, నిజామాబాద్ యందు ఉంటుందన్నారు. దరఖాస్తు ...
Read More »బిజెపి బడా జోకర్ పార్టీ
ఆర్మూర్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెపి పార్టీ అంటే బడా జోకర్ పార్టీ అని, బడా జోకర్ పార్టీలో ఇద్దరు జోకర్లు ఒకరు బండి సంజయ్ అయితే మరొకరు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అని వారిద్దరికీ పిచ్చి కుక్క కరిస్తే ఎలా వ్యవహరిస్తారో సీఎం కేసీఆర్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నారని పియుసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో ...
Read More »25న రైతు గర్జన సభ
బోధన్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ధర్నా చౌక్‌లో ఈ నెల 25న జరిగే రైతు గర్జన సభకు రైతులతో పాటు కార్మికులు, ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి మల్లేష్ పిలుపు నిచ్చారు. శనివారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం, రెంజల్ మండలం దూపల్లి గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ...
Read More »ప్రశ్నించే వారే వినియోగదారులు
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పండించే వారే రైతులు, పోరాడే వారే సైనికులు, ప్రశ్నించే వారే వినియోగదారులు అని తెలంగాణ వినియోగదారుల ఫోరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కన్వీనర్, కో-కన్వీనర్ తాళ్లపల్లి రాజు, ధర్మపురి శ్రవణ్ అన్నారు. ఈ మేరకు స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలోని విద్యార్థులకు వినియోగదారుల చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడైతే ప్రతిఒక్క వినియోగదారుడు తన హక్కులను తెలుసుకుని కొనుగోలు చేసే ప్రతి ఒక వస్తువు నాణ్యత ...
Read More »కెసిఆర్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఆర్మూరు ఐద్వా సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి సబ్బని లత మాట్లాడుతూ నాగార్జున సాగర్‌లో బుధవారం టిఆర్ఎస్ నిర్వహించిన సభలో సిఎం కేసిఆర్ మాట్లాడుతుండగా కొందరు మహిళలు (ఉపాధి హామీ ఫీల్్డ అసిస్టెంట్లు) తమను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ ప్లకార్డుడు ప్రదర్శించారని, దాంతో అసహనానికి, ఆగ్రహానికి గురైన సిఎం కేసిఆర్ మహిళలను కుక్కులు అంటూ దూషించారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా మహిళలంతా కేసిఆర్ తీరుపై మండిపడుతున్నారన్నారు. మహిళలను ...
Read More »ఆయనకు తొలినాళ్ల నుండి మహిళలంటే చిన్నచూపే
కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొన్న హాలియాలో జరిగిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి నిజాం సాగర్ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్ష్యురాలు అరుణాతర మాట్లాడుతూ పురుషులతో సహా అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారని అలాంటి మహిళలు రాష్ట్రముఖ్యమంత్రి ...
Read More »భక్తులతో కిట కిటలాడిన లింబాద్రి గుట్ట
భీమ్‌గల్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచల క్షేత్రం శనివారం రోజు ఉదయం 6 గంటల నుండి దర్శనాల రద్దీ ప్రారంభమైంది. కరోన తర్వాత రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు. 6 గంటల తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ...
Read More »