Breaking News

బిజెపి బడా జోకర్‌ పార్టీ

ఆర్మూర్‌, ఫిబ్రవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి పార్టీ అంటే బడా జోకర్‌ పార్టీ అని, బడా జోకర్‌ పార్టీలో ఇద్దరు జోకర్లు ఒకరు బండి సంజయ్‌ అయితే మరొకరు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అని వారిద్దరికీ పిచ్చి కుక్క కరిస్తే ఎలా వ్యవహరిస్తారో సీఎం కేసీఆర్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నారని పియుసి చైర్మన్‌ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి విలేకరుల‌ సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పనిచేసి రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర రావు పై జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్‌ కొవ్వు పట్టినట్లు వ్యవహరిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఓ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిపై ఎలా మాట్లాడాలో అన్న విషయం కూడా మరిచి పోయారని మండిపడ్డారు. బడా జుట పార్టీలో ఉన్నటువంటి జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్‌కు జిల్లాలో కనీసం పది మంది సర్పంచులు పదిమంది ఎంపీటీసీలు కూడా లేని స్థితిలో ఉన్నాడని పేర్కొన్నారు.

జాతీయ పార్టీగా పేరొందిన పార్టీలో ఉంటూ చెడు మనుషులుగా వ్యవహరించడం సరైన తీరు కాదని ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని నోరు అదుపులో పెట్టుకోవాల‌ని లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కెసిఆర్‌ను ఇష్టం వచ్చినట్టు తిడితే సహించమని పార్టీని అభివృద్ధి చేసుకోవాలి కానీ మనుషుల‌ని తిట్టడం మానుకోవాల‌ని చెప్పారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పండిత్‌ వినిత, వైస్‌ చైర్మన్‌ షేక్‌ మున్ను, కౌన్సిల‌ర్లు సుజాత, రేవతి, ప్రసాద్‌, శంకర్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు చందు, శివ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉచిత ఎరువులు ఎక్కడ? రైతు రుణ మాఫీ ఎప్పుడు?

ఆర్మూర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణ తహశీల్దార్‌ కార్యాల‌యం ఎదుట ...

Comment on the article