Breaking News

Daily Archives: February 14, 2021

ఆర్మూర్‌లో పోలీసు కళాజాత

ఆర్మూర్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల‌ మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎంఆర్‌ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ఫ్‌ అసోసియేషన్‌, బాధితుల‌ కోసము గల్ఫ్‌ వెళ్ళేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నకిలీ ఏజెంట్‌ మోసాల‌ గురించి వివరించారు. అలాగే గల్ప్‌లో జరిగే బాధల‌ గురించి, నకిలీ విసా మోసాల‌ గురించి, గల్ఫ్‌ వెళ్ళే వారు ఎలా అప్రమత్తంగా ఉండాల‌నే విషయాలు అవగాహన కల్పించారు. వాటి ...

Read More »

ప్రతి ఒక్కరు సేవా దృక్పథాన్ని అల‌వరుచుకోవాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరూ సేవాదృక్పథాన్ని అల‌వర్చుకోవాల‌ని విశ్రాంత ఐఎఎస్‌ అధికారి, తెలంగాణ ప్రభుత్వ పూర్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరి వినోద్‌ కె అగర్వాల్‌ ఉద్బోదించారు. క్రమశిక్షణ, పట్టుదల‌ అంకితభావంతో ముందుకు సాగితే జీవితంలో రాణిస్తారని ఆయన పేర్కొన్నారు. ల‌యన్స్‌ క్లబ్‌ తేజస్వి రీజియన్‌ సమావేశం ఆదివారం బర్దిపూర్‌ వద్ద గల‌ అమృతా గార్డెన్స్‌లో జరిగింది. కార్యక్రమానికి విశ్రాంత ఐఎఎస్‌ అధికారి వినోద్‌ కె అగర్వాల్‌ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ల‌యన్స్‌ ...

Read More »

అమర జవాన్లకు ఘన నివాళి

బోధన్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 14 దేశ రక్షణలో భాగంగా భారత సిఆర్‌పిఎఫ్‌ జవాన్లపై పుల్వామా వద్ద జరిగినా దాడి లో 40 మంది అమరులైన వీర జవాన్లకు భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల‌ర్పించారు. ఈ సందర్బంగా నిజామాబాద్‌ జిల్లా కో కన్వీనర్‌ చింతకుల‌ లోకేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ భారత వీరజవాన్ల త్యాగం ప్రతి ఒక్క భారతీయుని గుండెను కలిచి వేసిందని పేర్కొన్నారు. ఫ్రిబ్రవరి 14 నాడు భారత సంస్కృతి సంప్రదాయాలు నాశనం చేసేందుకు ...

Read More »

ప్రెస్‌ క్లబ్‌ కార్యవర్గం ఎన్నిక

బీర్కూర్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గాన్ని పాత్రికేయులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వంగ శ్రీధర్‌ గౌడ్‌ (నమస్తే తెలంగాణ), ప్రధాన కార్యదర్శిగా షేక్‌ మహాబూబ్‌ (నినాదం), కోశాధికారిగా వేణు గోపాల్‌ గౌడ్‌ (సాక్షి), గౌరవ అధ్యక్షులుగా గాండ్ల సంతోష్‌ కుమార్‌ (ఆంధ్రభూమి), ఉపాధ్యక్షులుగా భవాని సింగ్‌ (ఆంధ్రజ్యోతి) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడారు. పాత్రికేయుల‌ హక్కులు, సంక్షేమం కోసం పాటు పడతామని తెలిపారు. అనంతరం పరస్పరం మిఠాయిలు పంపిణీ ...

Read More »

రక్తదానం చేయడం అభినందనీయం

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి జలిగామ సూర్య మోహన్‌ మానవత దృక్పథంతో బ్లడ్‌ బ్యాంకులో రక్త నిలువ‌లు తగ్గిపోయాయని తెలుసుకుని రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా రెండు యూనిట్ల ప్లాస్మాను అందజేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాల‌ను కాపాడిన రక్తదాతను అభినందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం కావాలంటే 9492874006 కు సంప్రదించాల‌ని, వారికి దాతల‌ సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసి ...

Read More »

మనుషులు చెట్టంత ఎదగాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనిషి చెట్టులాగా పరోపకార భావనతో ఎదగాల‌ని చెట్టంత మనుషులుగా కావాల‌ని జిల్లా కేంద్ర గ్రంథాయం అధికారి తారకం అన్నారు. ఆదివారం హరిదా రచయితల‌ సంఘం ఆధ్వర్యంలో సియం కేసిఆర్‌ జన్మదినం పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్ పిలుపు మేరకు నిర్వహించిన ‘‘కోటి వృక్షార్చన’’ కవి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హరిదా రచయితల‌ సంఘం అద్యక్షుడు ఘనపురం దేవేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ హరితహారాన్ని స్వప్నించి ...

Read More »

సారంగాపూర్‌లో పోలీసు కళాజాత

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల‌ మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం నిజామాబాద్‌ 6 వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సారంగపూర్‌ గ్రామంలో శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్తుల‌కు పలు అంశాల‌పై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌ మోసాల‌ గురించి జాగ్రత్తలు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్‌ లేకుంటే ప్రయాణించ‌రాదని, ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తప్పకుండా జాగ్రత్తలు పాటించాల‌న్నారు. మోసపూరిత ప్రకటనల‌ను నమ్మవద్దని, అట్టి ప్రకటనల‌ను ...

Read More »