Breaking News

మనుషులు చెట్టంత ఎదగాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనిషి చెట్టులాగా పరోపకార భావనతో ఎదగాల‌ని చెట్టంత మనుషులుగా కావాల‌ని జిల్లా కేంద్ర గ్రంథాయం అధికారి తారకం అన్నారు. ఆదివారం హరిదా రచయితల‌ సంఘం ఆధ్వర్యంలో సియం కేసిఆర్‌ జన్మదినం పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్ పిలుపు మేరకు నిర్వహించిన ‘‘కోటి వృక్షార్చన’’ కవి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హరిదా రచయితల‌ సంఘం అద్యక్షుడు ఘనపురం దేవేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ హరితహారాన్ని స్వప్నించి సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే కాదు తెంగాణకే కోటి వృక్షార్చన గొప్ప బహుమానం అని, మానవాళికి పచ్చని ఆస్తి అని అభివర్ణించారు.

నరాల‌ సుధాకర్‌, తపోఫలం’, జి నరసింహ స్వామి ‘‘పుడమికి వడ్డానం’’, మద్దుకూరి సాయిబాబు ‘పచ్చదనం’’, దారం గంగాధర్‌ ‘చెట్టు స్వగతం’, కె.వి.రమణాచారి’ త్యాగజీవి, ఘనపురం దేవేందర్‌ ‘‘చెట్టంత మనిషి’ , పురం శంకర్‌ ‘పచ్చని వృక్షం’, ఎల‌గందుల‌ లింబాద్రి ‘చెట్టు బోధ’, మానస ‘‘చెట్టే ఆనందం’ తొగర్ల సురేశ్‌ ‘మొక్కే దిక్కు’, స్వర్ణ సమత ‘‘చెట్టుఘనత’’, సౌమ్య ‘ చిరుమొగ్గ’, రమావత్‌ కిరణ్‌ ‘బడిలోని చెట్టు’ గణేశ్‌ ‘‘బాధ్యత’’, మ‌ల్ల‌వరపు చిన్నయ్య గులాబ్కా గుల్ద‌స్తా’’, జెస్సీ అరుంధతీ ‘‘నీవు’’, చెన్న శంకర్‌ ‘ఆక్సిజన్‌’’, పురం సుధాంశ్‌ ‘‘ఆయువు నేనే’’, తిరుమల‌ శ్రీనివాసు ఆర్య ‘‘రక్షణ’’ కవితలు పచ్చదనం ప్రాధాన్యత తెలుపుతూ సాగాయి.

కార్యక్రమంలో కర్క రమేశ్‌ పాడిన చెట్టు పాట ఉర్రూతూగించింది. అనంతరం హరిదా ఆధ్వర్యంలో కవులందరినీ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాల‌య సిబ్బంది శ్రావణ్‌, శ్రీకాంత్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article