ఆర్మూర్‌లో పోలీసు కళాజాత

ఆర్మూర్‌, ఫిబ్రవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల‌ మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎంఆర్‌ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ఫ్‌ అసోసియేషన్‌, బాధితుల‌ కోసము గల్ఫ్‌ వెళ్ళేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నకిలీ ఏజెంట్‌ మోసాల‌ గురించి వివరించారు.

అలాగే గల్ప్‌లో జరిగే బాధల‌ గురించి, నకిలీ విసా మోసాల‌ గురించి, గల్ఫ్‌ వెళ్ళే వారు ఎలా అప్రమత్తంగా ఉండాల‌నే విషయాలు అవగాహన కల్పించారు. వాటి గురించి క్షుణ్ణంగా నాటక రూపంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ ఏసిపి రఘు, గల్ఫ్‌ అసోసియేషన్‌ సభ్యులు దాదాపు 200 మంది పాల్గొన్నారు.

Check Also

బిసిల‌ అభివృద్దిని పట్టించుకునే సమయం ప్రభుత్వానికి లేదు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌ సర్కారుకు బీసీ ఓట్ల పై ఉన్న ప్రేమ ...

Comment on the article