Breaking News

Daily Archives: February 15, 2021

11 పశువుల‌కు కృత్రిమ గర్భధారణ

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం తాడ్వాయి మండలంలోని కన్కల్‌ గ్రామంలో విజయ డెయిరీ అధ్వర్యంలో ఉచిత పశు వైధ్య శిబిరం నిర్వహించినట్టు కామారెడ్డి మిల్క్‌ షెడ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పి. శ్రీనివాసన్‌ తెలిపారు. శిబిరం మండలంలో పశుసంవర్థకశాఖ మరియు ప‌శుగణాభివృధి శాఖ సమన్వయంతో జరిగింది. శిబిరంలో మొత్తం 89 పశువుల‌కు చికిత్స చేసి కావల‌సిన మందులు విజయ డెయిరీ ద్వారా ఉచితంగా అందించారు. 11 పశువుల‌కు కృతిమగర్చధారణ జరిగింది. కార్యక్రమంలో విజయ డెయిరి డి.డి.శ్రీనివాస్‌, కన్కల్ పాల‌ ...

Read More »

పెన్సిల్‌పై సేవాలాల్‌ సూక్ష్మ చిత్రం

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బాన్సువాడ మండలం పోచారం తండాకు చెందిన జీవన్‌నాయక్‌ పెన్సిల్‌ మొనపై చెక్కిన సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌ సూక్ష్మ చిత్రాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌కి బహుకరించారు. జీవన్‌నాయక్‌ పనితీరును మెచ్చిన జిల్లా కలెక్టరు భవిష్యత్‌లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాల‌ని అభినందించారు.

Read More »

కామారెడ్డిలో సంత్‌ సేవాలాల్‌ జయంతి

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆధ్యాత్మిక గురువు సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 282 జయంతి పురస్కరించుకొని సోమవారం కామారెడ్డి జనహిత భవన్‌లో జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ ఆయన చిత్ర పటానికి పూల‌మాల‌ వేసి, జ్యోతి వెలిగించి నివాళుల‌ర్పించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టరు వెంకటేశ్‌ ధోత్రే, జిల్లా పరిషత్‌ సిఇఓ బి.చందర్‌నాయక్‌, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్‌, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిపాల‌నా అధికారి సయ్యద్‌ నేమతుల్లా, సీనియర్‌ అసిస్టెంట్లు సహదేవ్‌, ...

Read More »

ఫోన్‌ ఇన్‌లో 20 దరఖాస్తులు

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి కలెక్టరేటులోని జనహిత భవన్‌లో జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ 72 ప్రజావాణి దరఖాస్తుల‌ను స్వీకరించారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల‌ను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాల‌ని జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. వీటిలో 54 రెవిన్యూ శాఖ, 7 జిల్లా పంచాయితీ అధికారి, మీసేవ 3, విద్యుత్‌, మున్సిపాలిటీ, పోలీసు, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమశాఖ, ఎస్‌సి కార్పోరేషన్‌, వైద్య శాఖ, డబుల్‌ బెడ్‌రూమ్‌ సంబంధించి ఒక్కొక్క దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇవే కాకుండా ...

Read More »

17న 5.30 ల‌క్షల‌ మాస్‌ ప్లాంటేషన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 17న 5 ల‌క్షల‌ 30 వేల‌ మాస్‌ ప్లాంటేషన్‌కు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల‌ని‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సంబంధిత అధికారుల‌తో సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా 17 న నిర్వహించే మాస్‌ ప్లాంటేషన్‌పై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రెస్టీజ్‌గా తీసుకొని ప్రణాళిక ప్రకారం ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కల‌కు తగ్గకుండా నాటించడానికి ఒక రోజు ...

Read More »

జనావాసాల‌ వద్ద మాంసం వ్యర్థాలు

బోధన్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ లోని 29వ వార్డులో గల‌ మొచ్చిగల్లీ పక్కన ఉన్న గొడ్డు మాంసం విక్రయ దారులు మాంసం యొక్క వ్యర్థాల‌ను జనావాసాల‌లో రోడ్డు పక్కనే పారేస్తున్నారని కాల‌నీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గతంలో మున్సిపల్‌ కమిషనర్‌, జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌, జిల్లా కలెక్టర్‌కి స్థానికులు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. మాంసం వ్యర్థాల వ‌ల్ల‌ వచ్చే దుర్గంధంతో ఏవైనా విషపూరిత రోగాలు వస్తాయేమోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. జనావాసాల‌లో ...

Read More »

విద్యలో ఉన్నత వర్గాల‌కు దీటుగా బీసీ విద్యార్థులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి రెసిడెన్షియల్‌ హాస్టల్స్‌ ద్వారా బిసి విద్యార్థుల‌ను ఉన్నత వర్గాల‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల‌ మంత్రి గంగుల‌ కమలాకర్‌ తెలిపారు. సోమవారం తన పర్యటనలో భాగంగా ఆయన మాక్లూర్‌ మండలం దాస్‌ నగర్‌లో గల‌ మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌ బాలికల‌ పాఠశాల‌లో పర్యటించి విద్యార్థినిలు, ఉపాధ్యాయులు, అధికారుల‌తో ముఖాముఖి మాట్లాడారు.   వాటితోపాటు సదుపాయాలు, సన్న బియ్యం, ఆంగ్ల మాధ్యమం, తదితర ఏర్పాట్లు చేయడం ...

Read More »

షబ్బీర్‌ అలీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ జన్మదినం సందర్భంగా షబ్బీర్‌ అలీ సూచన మేరకు సోమవారం ఏలాంటి సంబరాలు కేకులు కట్‌ చేయకుండా కార్యక్రమాలు చేపట్టారు. దేశంలో రాష్ట్రంలో రైతు వ్యతిరేక చట్టాల వ‌ల్ల‌ ఎంతో మంది చనిపోయి ఎన్నో కష్ట నష్టాల‌కు ఓర్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న తరుణంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సరికాదని, తన జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు మాత్రమే చేయాల‌ని కాంగ్రెస్‌ ...

Read More »

దుండగుల‌ను ఉరి తీయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్వ హిందూ పరిషత్‌ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఇటీవల ఢిల్లీలో అయోద్య రామ మందిర నిర్మాణం కోసం నిధి సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న రింకుశర్మ అనే భజరంగ్‌ దళ్‌ కార్యకర్తను చంపిన దుండగుల‌ను వెంటనే ఉరి తీయాల‌ని డిమాండ్‌ చేస్తూ అదనపు కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు గోపాల‌కృష్ణ మాట్లాడుతూ దేశంలో ఒక పథకం ప్రకారం హిందువుల‌పై దాడులు జరుగుతున్నాయని ఇలాంటి దాడుల‌కు కారకులైన వారిని ...

Read More »

ఆర్మూర్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా గిరిజన మోర్చా ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాల‌ను ఘనంగా నిర్వహించారు. జంబీహానుమాన్‌ మందిరం నుండి ఎంఆర్‌ గార్డెన్స్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సేవాలాల్‌ మహరాజ్‌ చిత్రపటానికి పూల‌మాల‌లువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు నూతు శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్మూర్‌ పట్టణ గిరిజన మోర్చా అధ్యక్షుడు పీర్‌ సింగ్‌, జిల్లా మాజీ ...

Read More »

చెక్కులు పంపిణీ చేసిన బోధన్‌ ఎమ్మెల్యే

బోధన్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బోధన్‌ శాసనసభ్యులు క్యాంపు కార్యాంలో సాలూర గ్రామానికి చెందిన గైని ల‌క్ష్మి బాయి, పెంటకల‌న్‌ గ్రామానికి చెందిన బక్కోళ్ల సావిత్రిల‌కు 2 ల‌క్షల‌ చొప్పున చెక్కుల‌ను ఎమ్మెల్యే ఎండీ. షకీల్‌ ఆమ్మేర్‌ అందజేశారు. సాలూర గ్రామానికి చెందిన గైని గంగారాం కరెంట్‌ షాక్‌తో చనిపోగా, పెంటకలాన్‌కు చెందిన బక్కోళ్ల తిరుపతి ప్రమాద వశాత్తు చెరువులో పడి మరణించారు. వీరికి తెరాస పార్టీ సభ్యత్వం ఉన్నందున వీరి కుటుంబ సభ్యుల‌కు ఎమ్మెల్యే 2 ...

Read More »