కామారెడ్డి, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం తాడ్వాయి మండలంలోని కన్కల్ గ్రామంలో విజయ డెయిరీ అధ్వర్యంలో ఉచిత పశు వైధ్య శిబిరం నిర్వహించినట్టు కామారెడ్డి మిల్క్ షెడ్ డిప్యూటీ డైరెక్టర్ పి. శ్రీనివాసన్ తెలిపారు. శిబిరం మండలంలో పశుసంవర్థకశాఖ మరియు పశుగణాభివృధి శాఖ సమన్వయంతో జరిగింది. శిబిరంలో మొత్తం 89 పశువులకు చికిత్స చేసి కావలసిన మందులు విజయ డెయిరీ ద్వారా ఉచితంగా అందించారు.
11 పశువులకు కృతిమగర్చధారణ జరిగింది. కార్యక్రమంలో విజయ డెయిరి డి.డి.శ్రీనివాస్, కన్కల్ పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కిష్టరెడ్డి, మండల అధ్యక్షుడు రవి, ఉపసర్పంచి సాయిరెడ్డి, తాడ్వాయి డాక్టర్ రాంచందర్, లింగంపేట డాక్టర్ రవి, గోపామిత్రలు, డెయిరి పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021