బోధన్, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బోధన్ శాసనసభ్యులు క్యాంపు కార్యాంలో సాలూర గ్రామానికి చెందిన గైని లక్ష్మి బాయి, పెంటకలన్ గ్రామానికి చెందిన బక్కోళ్ల సావిత్రిలకు 2 లక్షల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే ఎండీ. షకీల్ ఆమ్మేర్ అందజేశారు. సాలూర గ్రామానికి చెందిన గైని గంగారాం కరెంట్ షాక్తో చనిపోగా, పెంటకలాన్కు చెందిన బక్కోళ్ల తిరుపతి ప్రమాద వశాత్తు చెరువులో పడి మరణించారు. వీరికి తెరాస పార్టీ సభ్యత్వం ఉన్నందున వీరి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే 2 లక్షల చెక్ లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులు ప్రమాద వశత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడద్దనే ఉద్దేశంతో తెరాస పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంంత్రి కెసిఆర్ 30 మరియు 100 రూపాయల సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. 2021 నుండి 2023 వరకు సభ్యత్వ కార్యక్రమం మొదలైనందున ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.
తెరాస ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతుందని తెలిపారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి కొరకు ఎకరానికి 10 వేలు, రైతు సాధారణంగా చనిపోతే 5 లక్షల భీమా, ఆడపడుచుల పెండ్లికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్రింద ఒక లక్ష పదహారు, అర్హులైన వారికి 5 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం లాంటి పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి, ఎన్డిసిసిబి బ్యాంక్ డైరెక్టర్ గిర్థవార్ గంగారెడ్డి, వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు సంజీవ్ కుమార్, రైసస మాజీ మండల్ కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్, రైతు బంధు అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, హన్మంతు, కోప్షన్ మెంబెర్ జహీర్, అందపూర్ సర్పంచ్ సుదర్శన్, మాజీ ఏఎంసి డైరెక్టర్ లక్ష్మణ్, విట్టల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021