Breaking News

పల్లె ప్రగతి పనులు వెనకబడితే చర్యలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి పనుల్లో వెనుకబాటు కనిపిస్తే సంబంధిత అధికారుల‌పై చర్యలుంటాయని అదేవిధంగా నాటిన ప్రతి మొక్కను బ్రతికించే విధంగా చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారుల‌తో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించి హరితహారం, ఉపాధి హామీ పథకం పనుల‌పై పు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్క పెరిగే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, ఒక్క మొక్క ఎండిపోయిన కూడా సంబంధిత అధికారుల‌పై చర్యలుంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా పల్లె ప్రగతి అన్ని పనులు కూడా నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌కు అనుగుణంగా నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు ప్రత్యేక శ్రద్ధతో విధులు నిర్వహించాల‌ని‌ ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరిగిన ఆ అధికారుల‌పై చర్యలుంటాయని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు, త్రాగునీరు, స్మశాన వాటికలు, కంపోస్టు షెడ్లు, ట్రీ గార్డ్స్‌, తదితర పనుల‌న్నీ వేగంగా సాగాల‌ని పేర్కొన్నారు.

అదేవిధంగా వ్యవసాయ పనులు పూర్తయినందున లేబర్‌ టర్న్‌ అవుట్‌ నిజామాబాద్‌ జిల్లా రాష్ట్రంలో టాప్‌ ఐదవ స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. పంచాయతీల‌కు ట్రాక్టర్‌, ట్యాంకర్‌ ఉన్నందున ప్రతిరోజు హరితహారం మొక్కల‌కు నీరు అందించాల‌ని ఆదేశించారు.

మండల‌ స్థాయిలో ఎంపీడీవోలు ప్రతి కార్యక్రమానికి సంబంధించి సమీక్ష నిర్వహించుకుంటూ గ్యాప్‌ ఉన్నచోట సరి చేయించుకుంటూ ముందుకు వెళ్ళ వల‌సిన బాధ్యత వారిపై ఉన్నదని తెలిపారు. సమీక్షలో అదనపు కలెక్టర్ ల‌త, డిఆర్‌డిఓ శ్రీనివాస్‌, డిపిఓ జయసుధ, ఏపీఓలు, ఎంపీడీవోలు మండల‌ ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రఖండ దేశభక్తుడు వీర సావర్కర్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ...

Comment on the article