నిజామాబాద్, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా యందు 12 కొత్త బార్లకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. కాగా దరఖాస్తుల స్వీకరణ 16వ తేదీ మంగళవారంతో ముగిసినట్టు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే వచ్చిన దరఖాస్తుల వివరాలు వెల్లడించారు.
1 .నిజామాబాద్ కార్పొరేషన్ – 7 బార్లకు గాను 23 దరఖాస్తులు
2. ఆర్మూరు మున్సిపాలిటీ – 1 బార్లకు గాను 14 దరఖాస్తులు
3. భీంగల్ మున్సిపాలిటీ – 1 బార్లకు గాను 46 దరఖాస్తులు
4. బోధన్ మున్సిపాలిటీ – 3 బార్లకు గాను 9 దరఖాస్తులు వచ్చాయన్నారు.
ఈనెల 18న ప్రగతిభవన్, కలెక్టరేట్ నిజామాబాద్ యందు ఉదయం 11 గంటలకు డ్రా తీయడం జరుగుతుందన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021