Breaking News

Daily Archives: February 17, 2021

18న ఒక బార్‌కు మాత్రమే డ్రా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా యందు 12 కొత్త బార్లకు నోటిఫికేషన్‌ జారీ అయిన విషయం తెలిసిందే. కాగా కమిషనర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌, టిఎస్‌ హైదరాబాద్‌ ఆదేశాల‌ మేరకు నిజామాబాద్‌ కార్పోరేషన్‌ 7, ఆర్మూర్‌ 1, బోధన్‌ 3 బార్లకు డ్రా నిలిపివేసినట్టు జిల్లా ప్రోహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ అధికారి డాక్టర్‌ నవీన్‌ చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం భీంగల్‌ మున్సిపాలిటీ లో గల‌ ఒక్క బారుకు మాత్రమే డ్రా జరుపబడుతుందని, ...

Read More »

కామారెడ్డి బార్లకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా…

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకు కొత్తగా మంజూరైన 4 బార్లు ఏర్పాటు కోసం 173 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక బార్‌ ఏర్పాటు కోసం 55, బాన్సువాడలో 2 బార్‌ల‌ కు 71, ఎల్లారెడ్డి లో ఒక బార్‌ ఏర్పాటు కోసం 45 దరఖాస్తులు స్వీకరించామన్నారు. ఈ నెల‌ 18న ఉదయం 11 గంటల‌కు కలెక్టరేట్‌లో బార్ల‌‌ కేటాయింపునకు డ్రా తీయబడుతుందన్నారు.

Read More »

నిరుద్యోగుల‌ను నిండా ముంచిన ఘనత కేసీఆర్‌దే

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి, ల‌క్షలాది ఉద్యోగాలు వస్తాయి అని భావించిన నిరుద్యోగుల‌కు కన్నీళ్లు , ఆత్మహత్యలే మిగిలాయని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు ఆరోపించారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ నుండి ఆంధ్ర ఉద్యోగుల‌ను తరిమి కొడదామని, రాష్ట్రం వస్తే ల‌క్షలాది ఉద్యోగాలు వస్తాయని, ఉద్వేగ ప్రసంగాల‌తో యువకుల‌ను నిరుద్యోగుల‌ను రెచ్చగొట్టి రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేకపోవడంతో రాష్ట్రంలోనే ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ...

Read More »

పల్లె ప్రకృతి వనాల‌తో పచ్చదనం పెరిగింది

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి కలెక్టర్‌ క్యాంపు కార్యాల‌యంలో బుధవారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి వృక్షార్చన కార్యక్రమంలో జిల్లాలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేశారని చెప్పారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల‌తో పచ్చదనం పెరిగిందని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని భావితరాల‌కు అందించాలంటే ప్రతి ఒక్కరూ మూడు మొక్కల‌ను నాటి సంరక్షణ చేయాల‌ని పేర్కొన్నారు. భావితరాల‌కు ప్రాణవాయువు ...

Read More »

ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా శాఖల‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల‌ను ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల‌లు, కళాశాల‌లు ప్రారంభమై విద్యార్థుల‌కు తరగతులు కొనసాగుతున్నాయని వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ముందుకు వెళ్లాల‌న్నారు. విద్యాసంస్థలు వసతి గృహాల్లో పాత బియ్యం ఏమైనా ...

Read More »

న్యాయవాదుల‌కు రక్షణ కల్పించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైకోర్టులో న్యాయవాదులుగా పని చేస్తున్న గట్టు వామన్‌ రావు, గట్టు నాగమణి దంపతుల‌ను పెద్దపల్లి జిల్లా మంథని కోర్టుకు హాజరై హైదరాబాద్‌ తిరిగి వెళ్తున్న కాల్వ‌ చర్ల దగ్గర దారుణంగా హత్య చేయడాన్ని న్యాయవాది పరిషత్‌ తీవ్రంగా ఖండిస్తోందని, న్యాయవాదుల‌ను చంపడం ద్వారా న్యాయం చనిపోలేదని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని భావిస్తోందని న్యాయవాది పరిషత్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.జగన్‌ మోహన్‌ గౌడ్‌ అన్నారు. న్యాయవాదుల‌ హత్యల‌కు బాధ్యులైన దుండగుల‌ను తక్షణమే ...

Read More »

లెదర్‌ పార్క్‌ నిర్మాణానికి నిధులు కేటాయించాలి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో చర్మకార ఉత్పత్తిదారుల‌ సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు కేటాయించిన లెదర్‌ పార్కు స్థలాల‌లో వెంటనే నిధులు కేటాయించి లెదర్‌ ఇండస్ట్రీస్‌ నిర్మాణం చేపట్టాల‌ని బుధవారం హైదరాబాద్‌ మినిస్టర్‌ క్వాటర్స్‌ లో ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల‌ ఈశ్వర్‌ని లెదర్‌ పార్కు సాధన చర్మకార ఉత్పత్తిదారుల‌ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు న‌ల్ల‌ రాజా రామ్‌, రాచర్ల రాజ్‌ దశరత్‌ ఎస్సీ ఉప కులాల‌ హక్కుల‌ పోరాట సమితి ...

Read More »

సిఎం ఏ మొక్క నాటారో తెలుసా…

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీఎం కేసిఆర్‌ జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ వినతి మేరకు సీఎం కేసిఆర్‌ కోటి వృక్షార్చనలో స్వయంగా పాల్గొని రుద్రాక్ష మొక్క నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్‌ కుమార్‌ ...

Read More »

మొక్కలు నాటి జన్మదిన బహుమతిగా ఇవ్వాలి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి వృక్ష ప్రేమికుడని, మొక్కల‌న్నా చెట్లన్నా ఆయనకు అమితమైన ఇష్టమని, ఆయన జన్మదినం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటి బహుమతిగా అందించాల‌ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వేల్పూరు మండల‌ కేంద్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి మొక్కలు నాటే ...

Read More »

ఉచిత ఎరువులు ఎక్కడ? రైతు రుణ మాఫీ ఎప్పుడు?

ఆర్మూర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణ తహశీల్దార్‌ కార్యాల‌యం ఎదుట బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బస్వ ల‌క్ష్మినర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల‌ కొరకు ఇసుమంత కూడా మేలు చేయట్లేదని, ఏక కాలంలో రుణ మాఫీ అని, ఉచిత ఎరువులు అని నమ్మపలికి రైతు నడ్డి విరుస్తున్నారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మూర్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ వినయ్‌ రెడ్డి మాట్లాడుతూ రైతే రాజని తమ ప్రభుత్వం ...

Read More »

టిసిఎఫ్‌ నూతన కార్యవర్గం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ వినియోగదారుల‌ ఫోరం ఉమ్మడి నిజామాబాద్‌ లోని కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కన్వీనర్‌ కో-కన్వీన‌ర్‌లు తాళ్లపల్లి రాజు, ధర్మపురి శ్రవణ్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గంలో అధ్యక్ష కార్యదర్శులుగా అమృత రాజేందర్‌, బసగ‌ల్ల‌ రమేష్‌, ఉపాధ్యక్షుడు తాటి ప్రశాంత్‌, సంయుక్త కార్యదర్శి చిన్నబీర సంతోష్‌, కోశాధికారి సోంకి సురేష్‌, సల‌హాదారుడు గుర్రా ప్రవీణ్‌ కుమార్‌లు నియమితుల‌య్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ వినియోగదారుల‌ ...

Read More »

నిజామాబాద్‌లో సిఎం జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు పుట్టినరోజు సందర్బంగా నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల‌ గణేష్‌ గుప్త చేతుల‌మీదుగా అర్బన్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో తెరాస నిజామాబాద్‌ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నుడ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, రెడ్‌ కో చైర్మన్‌ యస్‌. ఏ. అలీం, నుడ డైరెక్టర్లు, కార్పొరేటర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు నగర ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Read More »