లెదర్‌ పార్క్‌ నిర్మాణానికి నిధులు కేటాయించాలి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో చర్మకార ఉత్పత్తిదారుల‌ సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు కేటాయించిన లెదర్‌ పార్కు స్థలాల‌లో వెంటనే నిధులు కేటాయించి లెదర్‌ ఇండస్ట్రీస్‌ నిర్మాణం చేపట్టాల‌ని బుధవారం హైదరాబాద్‌ మినిస్టర్‌ క్వాటర్స్‌ లో ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల‌ ఈశ్వర్‌ని లెదర్‌ పార్కు సాధన చర్మకార ఉత్పత్తిదారుల‌ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు న‌ల్ల‌ రాజా రామ్‌, రాచర్ల రాజ్‌ దశరత్‌ ఎస్సీ ఉప కులాల‌ హక్కుల‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్వపు 12 ఉమ్మడి జిల్లాల‌లో 12 లెదర్ పార్కుల‌‌ కు గాను సుమారు 413 ఎకరాల‌ భూమి కేటాయించబడిందని కానీ నేటి వరకు వాటి నిర్మాణం చేపట్టకపోవడం వ‌ల్ల‌ చర్మకార వృత్తిపై ఆధారపడిన మోచి, మాదిగ కులాలు ప్రజలు ఆ రంగంలో శిక్షణ పొందినప్పటికీ ఉపాధి లేక ఇబ్బందుల‌కు గురవుతున్నారన్నారు.

ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించి లెదర్‌ పార్క్‌లు నిర్మించి ఆదుకోవాల‌ని ప్రభుత్వాన్ని కోరారు. లిడ్‌ క్యాప్‌ సంస్థ ద్వారా చర్మకార వృత్తిదారుల‌ అభివృద్ధికి పాటుపడవల‌సిన లిడ్‌ క్యాప్‌ సంస్థ యండి శ్రీనివాస్‌ నాయక్‌ వీరి సమస్యల‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకు పోకుండా అవినీతికి పాల్ప‌డుతున్నందున అతనిపై చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు ల‌క్ష్మీనారాయణ, సాయిరాం, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బిసిల‌ అభివృద్దిని పట్టించుకునే సమయం ప్రభుత్వానికి లేదు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌ సర్కారుకు బీసీ ఓట్ల పై ఉన్న ప్రేమ ...

Comment on the article