కామారెడ్డి, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి వృక్షార్చన కార్యక్రమంలో జిల్లాలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేశారని చెప్పారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలతో పచ్చదనం పెరిగిందని సూచించారు.
పరిశుభ్రమైన వాతావరణాన్ని భావితరాలకు అందించాలంటే ప్రతి ఒక్కరూ మూడు మొక్కలను నాటి సంరక్షణ చేయాలని పేర్కొన్నారు. భావితరాలకు ప్రాణవాయువు విరివిగా లభించే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడాలని ఆకాంక్షించారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021