Breaking News

న్యాయవాదుల‌కు రక్షణ కల్పించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైకోర్టులో న్యాయవాదులుగా పని చేస్తున్న గట్టు వామన్‌ రావు, గట్టు నాగమణి దంపతుల‌ను పెద్దపల్లి జిల్లా మంథని కోర్టుకు హాజరై హైదరాబాద్‌ తిరిగి వెళ్తున్న కాల్వ‌ చర్ల దగ్గర దారుణంగా హత్య చేయడాన్ని న్యాయవాది పరిషత్‌ తీవ్రంగా ఖండిస్తోందని, న్యాయవాదుల‌ను చంపడం ద్వారా న్యాయం చనిపోలేదని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని భావిస్తోందని న్యాయవాది పరిషత్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.జగన్‌ మోహన్‌ గౌడ్‌ అన్నారు.

న్యాయవాదుల‌ హత్యల‌కు బాధ్యులైన దుండగుల‌ను తక్షణమే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాల‌ని, సంఘటనపై పూర్తిస్థాయి న్యాయ విచారణ జరిపించాల‌ని న్యాయవాది పరిషత్‌ డిమాండ్‌ చేస్తుందన్నారు. పోలీస్‌ లాకప్‌ డెత్‌, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి అక్రమాల‌పై స్థానిక ఎమ్మెల్యే అక్రమాల‌పై హైకోర్టు ప్రజా ప్రయోజనాల వాజ్యాలు వేస్తూ ప్రజల‌ను చైతన్య పరుస్తూ ప్రజ ల‌పక్షాన నిలుస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న న్యాయవాదుల‌ను హత్య చేయడాన్ని ప్రభుత్వ హత్యలుగా భావించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రజాస్వామ్య విలువల‌ను కాపాడుతూ తమ వృత్తి ధర్మం నిర్వహిస్తున్న న్యాయవాదుల‌కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించి న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాల‌ని కోరారు. లేనిపక్షంలో న్యాయవాది పరిషత్‌ ఆందోళన నిర్వహిస్తుందన్నారు.

Check Also

ప్రఖండ దేశభక్తుడు వీర సావర్కర్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ...

Comment on the article