Breaking News

18న ఒక బార్‌కు మాత్రమే డ్రా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా యందు 12 కొత్త బార్లకు నోటిఫికేషన్‌ జారీ అయిన విషయం తెలిసిందే. కాగా కమిషనర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌, టిఎస్‌ హైదరాబాద్‌ ఆదేశాల‌ మేరకు నిజామాబాద్‌ కార్పోరేషన్‌ 7, ఆర్మూర్‌ 1, బోధన్‌ 3 బార్లకు డ్రా నిలిపివేసినట్టు జిల్లా ప్రోహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ అధికారి డాక్టర్‌ నవీన్‌ చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కేవలం భీంగల్‌ మున్సిపాలిటీ లో గల‌ ఒక్క బారుకు మాత్రమే డ్రా జరుపబడుతుందని, దరఖాస్తు దారులు నిజామాబాద్‌ ప్రగతి భవన్‌, కలెక్టరేట్‌ యందు ఈనెల‌ 18న ఉదయం 10 గంటల‌కు హాజరు కావాల‌న్నారు.

Check Also

21 నుండి డిగ్రీ, పిజి తరగతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, ...

Comment on the article