Breaking News

ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా శాఖల‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల‌ను ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల‌లు, కళాశాల‌లు ప్రారంభమై విద్యార్థుల‌కు తరగతులు కొనసాగుతున్నాయని వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ముందుకు వెళ్లాల‌న్నారు.

విద్యాసంస్థలు వసతి గృహాల్లో పాత బియ్యం ఏమైనా ఉంటే వాటిని మార్చిలోగా డిస్పోజ్‌ చేయాల‌ని పేర్కొన్నారు. వసతి గృహాల్లో తాగునీరు ఇతర సౌకర్యాల‌ సమస్యలు లేకుండా చూడాల‌న్నారు. మరోవైపు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నందున ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా అవగాహన కల్పిస్తూ మొదటి డోస్‌ తీసుకున్న ప్రతి ఒక్కరు రెండో డోస్‌ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాల‌న్నారు. అన్ని శాఖల‌ వారి ఆధ్వర్యంలో చేపట్టిన పనుల‌న్నీ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల‌ని శాఖల‌ ఆధ్వర్యంలో కూడా పనులు నిలిచి పోకుండా ఆల‌స్యం కాకుండా అధికారులు పర్యవేక్షణ చేసుకుంటూ ముందుకు వెళ్లాల‌ని ఆదేశించారు.

యాసంగి సాగు కొనసాగుతున్నందున వచ్చే పంటను దృష్టిలో పెట్టుకొని తదుపరి తీసుకోవాల్సిన చర్యల‌పై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల‌ని, యూరియా తదితర ఎరువుల‌ కొరత లేదని తెలిపారు. అక్కడక్కడ మినహా త్రాగునీటి సమస్య లేదని ఎక్కడైనా సమస్య దృష్టికి వస్తే పరిష్కరించాల‌ని ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారుల‌కు సూచించారు. సిడిఎఫ్‌, ఎస్‌డిఎఫ్‌, ఎంపీ లాడ్స్‌ లాంటి ప్రత్యేక నిధుల‌తో చేపట్టి కొనసాగుతున్న పనుల‌న్నీ మే చివరికల్లా పూర్తి చేయాల‌న్నారు.

హరిత హారంలోను, ఈ నెల‌ 17న ప్రత్యేకంగా నాటిన మొక్కల‌న్నీ ఎండిపోకుండా ప్రతిరోజు ఉపాధి హామీ పథకంలో నీటిని అందించాల‌ని డిఆర్‌డిఓ అధికారుల‌ను, ఎంపీడీవోల‌ను ఆదేశించారు. మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్స్‌, టాయిలెట్స్‌, ఓపెన్‌ జిమ్స్‌, స్మశాన వాటికలు ప్రారంభం కాకుంటే ప్రారంభించాల‌ని, పనులు కొనసాగుతున్నవాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాల‌ని కమిషనర్లను ఆదేశించారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, వీఐపీలు, విఐపిల‌ను ఆహ్వానించడంలో ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రోటోకాల్‌ పాటించాల‌ని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, డిఎఫ్‌ఓ సునీల్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డిఏవో గోవిందు, జిల్లా పరిషత్‌ సీఈవో గోవింద్‌ నాయక్‌, డిపిఓ జయసుధ, సిపిఓ శ్రీరాము, డిఆర్‌డిఓ శ్రీనివాస్‌, ఆర్‌డివోలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

21 నుండి డిగ్రీ, పిజి తరగతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, ...

Comment on the article