Breaking News

టిసిఎఫ్‌ నూతన కార్యవర్గం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ వినియోగదారుల‌ ఫోరం ఉమ్మడి నిజామాబాద్‌ లోని కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కన్వీనర్‌ కో-కన్వీన‌ర్‌లు తాళ్లపల్లి రాజు, ధర్మపురి శ్రవణ్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గంలో అధ్యక్ష కార్యదర్శులుగా అమృత రాజేందర్‌, బసగ‌ల్ల‌ రమేష్‌, ఉపాధ్యక్షుడు తాటి ప్రశాంత్‌, సంయుక్త కార్యదర్శి చిన్నబీర సంతోష్‌, కోశాధికారి సోంకి సురేష్‌, సల‌హాదారుడు గుర్రా ప్రవీణ్‌ కుమార్‌లు నియమితుల‌య్యారు.

ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ వినియోగదారుల‌ ఫోరం రెండవ వార్షికోత్సవ సభలో రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు అంబు రాథోడ్‌, శోభారాణి ల‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ వినియోగదారుల‌ హక్కు పరిరక్షణకు, అమలుకు పాటుపడుతామని, ప్రజల‌ ఆరోగ్యాల‌తో చెల‌గాటమాడే అమ్మకం దారుల‌ భరతం పడతామని ప్రతిఒక వినియోగదారుడికి న్యాయం చేసే దిశగా పయనిస్తూ వారిపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ లోని అన్ని జిల్లాల‌ కన్వీనర్‌ కో-కన్వీనర్‌ల‌ తో పాటు అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

Check Also

ప్రఖండ దేశభక్తుడు వీర సావర్కర్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ...

Comment on the article