ఆర్మూర్, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల కొరకు ఇసుమంత కూడా మేలు చేయట్లేదని, ఏక కాలంలో రుణ మాఫీ అని, ఉచిత ఎరువులు అని నమ్మపలికి రైతు నడ్డి విరుస్తున్నారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ వినయ్ రెడ్డి మాట్లాడుతూ రైతే రాజని తమ ప్రభుత్వం రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ రైతుల అభివృద్ధి కొరకు పని చేస్తుందని అనడం సిగ్గు చేటని, వారం రోజుల్లో దేశం ఆశ్చర్య పోయే వార్త చెప్తానని చెప్పి అందరినీ మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు భూపతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జేస్సు అనీల్, మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆకుల రాజు, దుగ్గి విజయ్, యం.పి.టి.సి.లు, కౌన్సిలర్లు, ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021