Breaking News

Daily Archives: February 18, 2021

పదిరోజుల్లో కొండపోచమ్మ ద్వారా సాగునీరు

బాన్సువాడ, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పది రోజుల్లో నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని విడుదల‌ చేయడం జరుగుతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. గురువారం బాన్సువాడ మండలం దేశాయిపేటలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక సహకార సంఘం భవనం, రైతు వేదిక భవనం, డబుల్‌ బెడ్‌ రూమ్‌ నిర్మాణానికి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రోడ్లు భవనాలు, అసెంబ్లీ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార ...

Read More »

ప్రారంభమైన సివిల్‌ సప్లయి హమాలీల‌ నిరవధిక సమ్మె

కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి మండల‌ స్థాయి గిడ్డంగి వద్ద సివిల్‌ సప్లై హమాలీ కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. సివిల్‌ సప్లై జిల్లా కార్యదర్శి జి రాజు మాట్లాడుతూ హమాలి రేట్లు క్వింటాలుకు 18 రూపాయలు నుంచి ఇరవై మూడు రూపాయల‌కు ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది, కానీ ఇప్పటివరకు జిఓ ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. సివిల్‌ సప్లై చైర్మన్‌ హమాలీ కార్మికుల‌ న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు ...

Read More »

కామారెడ్డిలో బార్లు దక్కించుకున్న వారు వీరే…

కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధ్వర్యంలో జిల్లాలోని కామారెడ్డి మున్సిపాలిటీ పరిథిలో ఒకటి, బాన్సువాడ మున్సిపాలిటీ పరిథిలో 2, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఒకటి చొప్పున మొత్తం నాలుగు నూతన బార్లకు సంబంధించిన ల‌క్కీ డ్రా కార్యక్రమం జనహిత భవన్‌లో జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు ల‌క్కీ డ్రా తీశారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 55 దరఖాస్తులు రాగా అక్కల‌ ల‌క్ష్మి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 47 ...

Read More »

21 నుండి డిగ్రీ, పిజి తరగతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, 3వ, 5వ సెమిస్టర్‌ తరగతులు, పిజి ద్వితీయ సంవత్సరం తరగతులు ఈనెల‌ 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ప్రాంతీయ అధ్యయన కేంద్రం రీజనల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పిజి ప్రథమ సంవత్సరం తరగతులు మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. అభ్యర్థులు తప్పకుండా తరగతుల‌కు హాజరు కావాల‌ని అంబర్‌సింగ్‌ పేర్కొన్నారు.

Read More »

భీమ్‌గల్‌ బార్‌ దక్కించుకున్న బద్దం రాకేశ్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మునిసిపాలిటీలో కొత్తగా నోటిఫై చేయబడిన ఒక బారుకు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి గురువారం దరఖాస్తు దారుల‌ సమక్షంలో ప్రగతిభవన్‌ కలెక్టరేట్‌లో డ్రా తీశారు. ఇందులో బద్దం రాకేశ్‌ విజేతగా నిలిచి బార్‌ దక్కించుకున్నారు. మిగిలిన నిజామాబాద్‌ కార్పొరేషన్‌, బోధన్‌ మునిసిపాలిటి, ఆర్మూర్‌ మునిసిపాలిటీలో నోటీఫై చేయబడిన కొత్త బార్లకు ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కమీషనర్‌ ఆదేశాల‌ ప్రకారం తర్వాత డ్రా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్‌ ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ ఆఫీసర్‌ ...

Read More »

అగ్రశ్రేణి సామాజిక సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితుల‌ అభ్యున్నతికి కృషి చేసిన భాగ్యరెడ్డివర్మ తెలంగాణ గడ్డపై జన్మించిన అగ్రశ్రేణి సామాజిక సంస్కర్త అని హరిదా రచయితల‌ సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ అన్నారు. గురువారం హరిదా రచయితల‌ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కేర్‌ డిగ్రీ కళాశాల‌లో జరిగిన భాగ్యరెడ్డివర్మ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హిందూమతంలో సంస్కరణ కోరుకుని, దళిత జాతి అభ్యున్నతికి, దళిత జాతి చదువుల‌కు, దళిత జాతి చైతన్యానికి ఎంతో శ్రమించిన వ్యక్తి అని నివాళులు ...

Read More »

దొన్పాల్‌లో పోలీసు కళాజాత

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల‌ మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం మోర్తాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దొన్పాల్‌ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల‌కు ఆన్‌లైన్‌ మోసాల‌ గురించి, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్‌ లేకుంటే ప్రయాణించరాదని, ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు. మోసపూరిత ప్రకటనల‌ను నమ్మవద్దని, అట్టి ప్రకటనల‌ను చూసి బ్యాంక్‌ సమాచారం / ఎఇఎం కార్డ్‌ సమాచారం ఇవ్వకూడదని ...

Read More »

2021-22 సంవత్సరానికి పిఎల్‌పికి ఆమోదం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2021- 22 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్‌ ఆధ్వర్యంలో ముద్రించిన పొటెన్షియల్‌ లింక్డు క్రెడిట్‌ ప్లాన్‌కు పిఎల్‌పి చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధ్యక్షతన ఆమోదం తెలిపారు. ఈ మేరకు సంబంధిత బ్యాంకు అధికారుల‌తో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల‌ అధికారులు కలెక్టర్‌ను గురువారం ఆయన చాంబర్‌లో కలిసి ఈ నోట్స్‌కు ఆమోదింప చేసుకుని లాంచింగ్‌ చేయించారు. పిఎల్‌పి ఆధారంగా జిల్లాలో ఆయా ప్రాంతాల‌లో సాగుచేసే పంటల‌కు, అవసరాల‌కు అనుగుణంగా జిల్లాలోని అన్ని ...

Read More »