Breaking News

2021-22 సంవత్సరానికి పిఎల్‌పికి ఆమోదం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2021- 22 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్‌ ఆధ్వర్యంలో ముద్రించిన పొటెన్షియల్‌ లింక్డు క్రెడిట్‌ ప్లాన్‌కు పిఎల్‌పి చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధ్యక్షతన ఆమోదం తెలిపారు. ఈ మేరకు సంబంధిత బ్యాంకు అధికారుల‌తో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల‌ అధికారులు కలెక్టర్‌ను గురువారం ఆయన చాంబర్‌లో కలిసి ఈ నోట్స్‌కు ఆమోదింప చేసుకుని లాంచింగ్‌ చేయించారు.

పిఎల్‌పి ఆధారంగా జిల్లాలో ఆయా ప్రాంతాల‌లో సాగుచేసే పంటల‌కు, అవసరాల‌కు అనుగుణంగా జిల్లాలోని అన్ని బ్యాంకుల‌కు ల‌క్ష్యాలు నిర్దేశిస్తూ జిల్లాస్థాయి రుణ ప్రణాళిక సిద్ధం చేసి నిర్వహించే సమావేశంలో ఆమోదం తెలియజేస్తారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గైడ్‌లైన్స్‌ ప్రకారం తయారుచేసిన ఈ పిఎల్‌పిలో క్రాప్‌ ప్రొడక్షన్‌, టర్మ్‌ లోన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మార్కెటింగ్‌ నిర్వహణ తదితర వ్యవసాయ అవసరాల‌తో పాటు సూక్ష్మ చిన్న మధ్యతరహా రంగాలు, ఫామ్‌ మెకానైజేషన్‌ గృహ, విద్య రుణాల‌కు కలిపి రూ. 6610.66 కోట్లుగా ఆమోదించారు.

గత సంవత్సరం పిఎల్‌పి కింద రూ. 5797 కోట్లకు ఆమోదించగా ఈ సంవత్సరం దానికి మరో 13 శాతం పెంచి ప్రణాళిక సిద్ధం చేశారు. కార్యక్రమంలో నాబార్డు డిడి యం నగేష్‌, ఎల్‌డిఎం జయ సంతోషి, యు.బి.ఐ. డీజీఎం నరేంద్ర, టిజిఎం రాజేంద్ర, డిసిసిబి సీఈవో గజానన్‌, జిల్లా పరిశ్రమల‌ కేంద్రం జిఎం బాబురావు, జిల్లా పశుసంవర్ధక, వెటరినరీ అధికారి భరత్‌, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి నర్సింగ్‌ దాస్‌, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, తదితరులు, పాల్గొన్నారు

Check Also

21 నుండి డిగ్రీ, పిజి తరగతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, ...

Comment on the article