Breaking News

భీమ్‌గల్‌ బార్‌ దక్కించుకున్న బద్దం రాకేశ్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మునిసిపాలిటీలో కొత్తగా నోటిఫై చేయబడిన ఒక బారుకు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి గురువారం దరఖాస్తు దారుల‌ సమక్షంలో ప్రగతిభవన్‌ కలెక్టరేట్‌లో డ్రా తీశారు. ఇందులో బద్దం రాకేశ్‌ విజేతగా నిలిచి బార్‌ దక్కించుకున్నారు.

మిగిలిన నిజామాబాద్‌ కార్పొరేషన్‌, బోధన్‌ మునిసిపాలిటి, ఆర్మూర్‌ మునిసిపాలిటీలో నోటీఫై చేయబడిన కొత్త బార్లకు ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కమీషనర్‌ ఆదేశాల‌ ప్రకారం తర్వాత డ్రా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్‌ ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నవీన్‌ చంద్ర, సిఐ, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ రెండవ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిరోజు తమ విధుల్లో భాగంగా ప్రజల‌తో మమేకమై ఉండే ...

Comment on the article