Breaking News

21 నుండి డిగ్రీ, పిజి తరగతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, 3వ, 5వ సెమిస్టర్‌ తరగతులు, పిజి ద్వితీయ సంవత్సరం తరగతులు ఈనెల‌ 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ప్రాంతీయ అధ్యయన కేంద్రం రీజనల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పిజి ప్రథమ సంవత్సరం తరగతులు మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. అభ్యర్థులు తప్పకుండా తరగతుల‌కు హాజరు కావాల‌ని అంబర్‌సింగ్‌ పేర్కొన్నారు.

Check Also

ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ రెండవ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిరోజు తమ విధుల్లో భాగంగా ప్రజల‌తో మమేకమై ఉండే ...

Comment on the article